ఫిల్మ్ ఇండస్ట్రీ లో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది టాలీవుడ్(Tollywood) పెద్ద పెద్ద నటులను కోల్పోయింది. ఇక బాలీవుడ్ , హాలీవుడ్, పాప్ తారలు కూడా చాలా మంది మరణించారు. ఇలా వరుస మరణాలు ఫిల్మ్ ఇండస్ట్రీని(Film Industry) విషాదంలో నింపుతున్నాయి. ఇక హాలీవుడ్ లో కూడా ప్రముఖ తారలు కన్నుమూయడం జరిగింది. ఇక తాజగా హాలీవుడ్ స్టార్ ఒకరు కన్ను మూశారు. గ‌త కొంతకాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న హాలీవుడ్ న‌టుడు ఆండ్రీ బ్రౌగ‌ర్(Andre Braugher) తిరిగిరాని లోకాలకువెళ్లిపోయారు.

హాలీవుడ్ లో పాపులర్ టీవీ షోల్లో నటించారు ఆంద్రీ. ఆయన 61 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. ఆండ్రీ బ్రౌగర్ భార్య అమీ బ్రాబ్సన్(Brabson) కూడా ప్రముఖ నటే. వీరికి ముగ్గురు కుమారులున్నారు. ఆండ్రీ మ‌ర‌ణంతో కుటుంబ అంతా విషాదంలో మునిగిపోయింది. ఇక ఆండ్రీకి ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన మరణ వార్త వారిని శోఖ సంద్రంలో ముంచెత్తింది. సడెన్ గా ఇలా తెలియడంతో ఆయ‌న అభిమానులు షాక్ కు గుర‌య్యారు. వివిధ దేశాల నుంచి సంతాపాలు ప్రకటిస్తున్నారు.

ఇక హాలీవుడ్ స్టార్ బ్రౌగ‌ర్ గురించి చూస్తే.. ఆయన 1962, జులై 1న చికాగోలో జ‌న్మించారు. థియేటర్ స్టూడెంట్ గా లైఫ్ స్టార్ట్ చేసి.. వెండితెరపై వెలుగొందారు. కామెడీ షో బ్రూక్లిన్ నైన్‌-నైన్‌లో కెప్టెన్ రేమాండ్ హాల్ట్ పాత్ర‌లో ఆండ్రీ అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. 1990ల్లో హోమిసైడ్ : లైఫ్ ఆన్ ది స్ట్రీట్‌లో డిటెక్టివ్ ఫ్రాంక్ పెంబ్లిట‌న్ పాత్ర‌తో ఆయ‌నకు ప్రాచుర్యం ల‌భించింది. కామెడీ సిరీస్‌లో ఆయ‌న‌కు రెండు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ ల‌భించాయి. దీనికి తోడు ఆండ్రీ నాలుగు ఎమ్మీ నామినేష‌న్స్ కూడా స్వీరించారు.

హార్వీ వీన్‌స్టీన్ స్కాండ‌ల్‌పై న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ఆధారంగా తెర‌కెక్కిన షి సెడ్ డ్రామాలో ఇటీవ‌ల ఆయ‌న క‌నిపించారు. ఈ ప్రాజెక్టులో న్యూయార్క్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిట‌ర్ డీన్ బాక్వెట్ పాత్ర‌లో ఆయ‌న క‌నిపించారు. ఇక ఆండ్రీ బ్రౌగ‌ర్ తాను న‌టిస్తూ తెర‌కెక్కించిన ల‌వ్ సాంగ్స్ షోటైం ట్రియాల‌జీలోనూ క‌నిపించారు.

Updated On 14 Dec 2023 7:19 AM GMT
Ehatv

Ehatv

Next Story