Actor Al Pacino : ప్రియురాలు కడుపుతో ఉందని తెలియగానే డీఎన్‌ఏ పరీక్షకు డిమాండ్ చేసిన నటుడు
హాలీవుడ్ సీనియర్ నటుడు అల్‌ఫ్రెడో జేమ్స్ పాసినో(Actor Al Pacino) 83 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నారని నిన్నమొన్న వార్తలు వచ్చాయిగా! అందరూ అల్ పాసినోగా పిల్చుకునే ఆయన హలీవుడ్ నటి, 29 ఏళ్ల నూర్ అల్ఫల్లాతో కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం నూర్ అల్ఫల్లా కడుపుతో ఉందని, నూర్ ఎనిమిది నెలల గర్భవతి అని, అల్ పాసినో నాలుగో బిడ్డకు తండ్రి కాబోతున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి.

Actor Al Pacino
హాలీవుడ్ సీనియర్ నటుడు అల్‌ఫ్రెడో జేమ్స్ పాసినో(Actor Al Pacino) 83 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నారని నిన్నమొన్న వార్తలు వచ్చాయిగా! అందరూ అల్ పాసినోగా పిల్చుకునే ఆయన హలీవుడ్ నటి, 29 ఏళ్ల నూర్ అల్ఫల్లా(Noor Alfallah)తో కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం నూర్ అల్ఫల్లా కడుపుతో ఉందని, నూర్ ఎనిమిది నెలల గర్భవతి అని, అల్ పాసినో నాలుగో బిడ్డకు తండ్రి కాబోతున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. నూర్ గర్భవతి అని తెలిసిన తర్వాత నుంచి అల్ పాసినో తీవ్ర అసహనంతో ఉన్నారట. ఇద్దరి మధ్య చాలా తతంగమే నడిచిందట! అసలు తనకు పిల్లలు పుట్టే సామర్థ్యం ఉందా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారట అల్ పాసినో. గతంలో తాను చేయించుకున్న వైద్య పరీక్షల్లో తనకు పిల్లలు పుట్టే సామర్థ్యం లేదని తేలిందని నూర్‌కు చెప్పారట. నూర్ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి తానో కాదో తేలడానికిడీఎన్‌ఏ పరీక్ష చేయించుకోవాలని డిమాండ్ చేస్తున్నారట! మరో మాట మాట్లాడకుండా నూర్ డీఎన్‌ఏ పరీక్షలు చేయించుకుంది. అందులో ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి అల్ పాసినోనే అని రుజువయ్యింది. నిర్మాత అయిన నూర్‌తో అల్ పాసినోకు 2019లో పరిచయం ఏర్పడింది. కోవిడ్ ఫస్ట్ వేవ్ అప్పుడు ఏర్పడిన పరిచయం తర్వాత ప్రేమగా మారింది. ఆ ప్రేమ వారిద్దరిని కలిసి ఉండేలా చేసింది. వీరిద్దరు రిలేషన్‌షిప్ ఉన్న విషయం గత ఏడాది ఏప్రిల్‌లో తెలిసింది. సోషల్ మీడియాలో వీరు ఓ ఫోటోను పోస్ట్ చేశారు. వచ్చే నెల నూర్ అల్ఫల్లా తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నది. మాజీ ప్రియురాలు మీటల్ దోహన్‌తో బ్రేకప్ అయిన వెంటనే నూర్‌తో డేటింగ్ మొదలు పెట్టారు అల్ పాసినో.
