ఎన్టీఆర్(NTR) కోసం పెద్ద ప్లానే వేశాడు కొరటాల శివ(Koratala Shiva). NTR30ని పాన్ వరల్డ్(Pan World) స్థాయిలో తెరకెక్కించడానికి ప్లాన్ చేశాడు. ఈక్రమంలో తారక్ యాక్షన్ సీన్స్ కోసం హాలీవుడ్(Hollywood) నుంచి యాక్షన్ కొరియోగ్రాఫర్ ను కూడా దించాడు దర్శకుడు. ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ కోసం ఇప్పటికే బ్లడ్ ట్యాంక్ లను దించాడు కొరటాల శివ. రక్తం ఏరులై పారించడానికి సిద్దమయ్యాడు.

ఎన్టీఆర్(NTR) కోసం పెద్ద ప్లానే వేశాడు కొరటాల శివ(Koratala Shiva). NTR30ని పాన్ వరల్డ్(Pan World) స్థాయిలో తెరకెక్కించడానికి ప్లాన్ చేశాడు. ఈక్రమంలో తారక్ యాక్షన్ సీన్స్ కోసం హాలీవుడ్(Hollywood) నుంచి యాక్షన్ కొరియోగ్రాఫర్ ను కూడా దించాడు దర్శకుడు.

ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ కోసం ఇప్పటికే బ్లడ్ ట్యాంక్ లను దించాడు కొరటాల శివ. రక్తం ఏరులై పారించడానికి సిద్దమయ్యాడు. ఫస్ట్ షెడ్యూల్ లోనే భారీ యాక్షన్ సీన్స్ ను షూట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దాని కోసం హౌదరాబాద్ లో సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు స్పెషల్ గా యాక్షన్ సీన్స్ కోసం సెట్స్ కూడా రూపొందిస్తున్నారట టీమ్. ఇక నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఎన్టీఆర్30 ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. ఇక సెట్స్ ఎక్కడమే తరువాతయి. ఇక జాన్వీకపూర్ హీరోయిన్ గా నటించబోతున్న ఈసినిమాను భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో... రూపొందించబోతున్నారు.

ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ ఇమేజ్ సాధించిన ఎన్టీఆర్ ను దృష్టిలో పెట్టుకుని.. కొరటాల శివ ఈసినిమా కోసం భారీ ప్రణాళికలు సిద్ధం చేశాడట. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పక్కా వరల్డ్ క్లాస్ క్వాలిటీతో సినిమాను నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇందులో భాగంగా ఈసినిమాలో యాక్షన్ సీన్స్ కోసం.. ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్ని బేట్స్ ను తీసుకున్నారు కొరటాల టీమ్. ఇప్పటికే ఆయన ఇండియాలో లాండ్ అవ్వడం.. కొరటాలకు కొన్ని ప్రాజెక్ట్ లు చూపించడం జరిగిపోతుంది. దీనికి సబంధించిన ఓ వర్కింగ్ స్టిల్‌ను రిలీజ్ చేశారు మూవీ టీమ్.

ఇక హాలీవుడ్ స్టార్ యక్షన్ కోరియోగ్రఫర్ బేట్స్.. మిషన్‌ ఇంపాజిబుల్‌ లాంటి భారీ యాక్షన్ సీనిమాలకు పనిచేశారు. అటువంటి ఆయన ఎన్టీఆర్ తో ఎటువంటి ఫీట్లు చేయిస్తాడా అని చూస్తున్నారు ఫ్యాన్స్. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఐలాండ్ & పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈసినిమాను కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం ట్యాంకర్లలో డూప్ బ్లడ్ ను తీసుకెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది. సోషల్ మీడియాలో NTR30 కి సబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

Updated On 26 March 2023 11:49 PM GMT
Ehatv

Ehatv

Next Story