హిందీ బిగ్‌బాస్(Hindi bigg boss) విజేత ఎల్విష్ యాదవ్(Elvish yadav) చాలా అతి చేశాడు. యూ ట్యూబర్ సాగర్ ఠాకూర్(Sagar thakur) అలియాస్ మాక్స్‌టర్న్‌ను చెంప చెళ్లుమనిపించాడు. కాలితో తన్నాడు. దారుణంగా కొట్టాడు. తన ఫ్రెండ్స్‌తో షాపింగ్‌మాల్‌కు వెళ్లి ఎల్విష్ యాదవ్ అక్కడ ఓవరాక్షన్ చేశాడు. అక్కడే ఉన్న సాగర్ ఠాకూర్ తనను కలుసుకోవడానికి ఎల్విస్ యాదవ్ వచ్చాడేమోననుకుని ముందుకు వెళ్లాడు అతడు.

Elvish yadav
హిందీ బిగ్‌బాస్(Hindi bigg boss) విజేత ఎల్విష్ యాదవ్(Elvish yadav) చాలా అతి చేశాడు. యూ ట్యూబర్ సాగర్ ఠాకూర్(Sagar thakur) అలియాస్ మాక్స్‌టర్న్‌ను చెంప చెళ్లుమనిపించాడు. కాలితో తన్నాడు. దారుణంగా కొట్టాడు. తన ఫ్రెండ్స్‌తో షాపింగ్‌మాల్‌కు వెళ్లి ఎల్విష్ యాదవ్ అక్కడ ఓవరాక్షన్ చేశాడు. అక్కడే ఉన్న సాగర్ ఠాకూర్ తనను కలుసుకోవడానికి ఎల్విస్ యాదవ్ వచ్చాడేమోననుకుని ముందుకు వెళ్లాడు అతడు. యూ ట్యూబర్ సాగర్ ఠాకూర్ దగ్గరకు వెళ్లగానే ఎల్విస్ చెంప చెళ్లుమనించాడు. కాలితో తన్నాడు. అతడు తిరగబడేలోపు ఎల్విస్ మనుషులు చితకబాదారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్(Social media) అవుతుననాయి. ఎల్విష్ యాదవ్‌పై సాగర్ ఠాకూర్ పోలీసు కంప్లయింట్ ఇచ్చాడు. గురుగ్రామ్ పోలీసులు యాదవ్‌పై కేసు కూడా నమోదు చేశారు. ఎల్విష్ తనను కలవాలనుకుంటున్నాడని తెలిసినప్పుడు ఏదో మాట్లాడతాడనుకున్నానని, కానీ పది మందిని వెంటేసుకుని వచ్చి తనపై దాడి చేశాడని సాగర్ ఠాకూర్ చెబుతున్నారు. వారంతా ఫుల్లుగా తాగి ఉన్నారని, బూతులు మాట్లాడుతూ కొట్టారని చెప్పాడు. మార్చి 8వ తేదీన జరిగిన ఈ సంఘటనలో ఎల్విష్ తన వెన్నెముక విరగ్గొట్టాలని చూశాడని, పోతూపోతూ తనను చంపేస్తానని బెదిరించాడని తెలిపాడు.తన రియాక్షన్ చెబుతూ సాగర్ ఠాకూర్ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. అయితే గతంలో ఎల్విష్‌పై సాగర్ ఠాకూర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని, ఆ కోపంతోనే ఇలా దాడి చేశాడని చెబుతున్నారు. అటు ఎల్విష్.. పామువిషంతో రేవ్ పార్టీ చేసుకున్నాడంటూ గత ఏడాది చివర్లో అతడిపై కేసు కూడా నమోదైంది. ఆ ఇన్సిడెంట్‌ను మర్చిపోక ముందే మరోసారి చీప్‌గా ప్రవర్తించాడు ఎల్విష్ యాదవ్.
