ఇటీవల ముగిసిన హిందీ బిగ్‌బాస్‌(Hindi bigg boss) 17వ సీజన్‌లో స్టాండప్‌ కమెడియన్‌ మునావర్‌ ఫరూఖీ(Munawar Farooqui) విజయం సాధించాడు. నటుడు అభిషేక్‌ కుమార్‌(Abishek kumar) రన్నరప్‌గా(Runer Up) నిలిచాడు. హీరోయిన్‌ మన్నారా చోప్రా(Mannara Chopra), నటి అంకిత లోఖండే(Ankitha Lokhande), హైదరాబాద్‌కు చెందిన అరుణ్‌(Arun) తర్వాతి ప్లేసుల్లో నిలిచారు. టైటిల్‌ను తృటిలో మిస్‌ చేసుకున్న అభిషేక్‌ కుమార్‌ పాపం బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు.

ఇటీవల ముగిసిన హిందీ బిగ్‌బాస్‌(Hindi bigg boss) 17వ సీజన్‌లో స్టాండప్‌ కమెడియన్‌ మునావర్‌ ఫరూఖీ(Munawar Farooqui) విజయం సాధించాడు. నటుడు అభిషేక్‌ కుమార్‌(Abishek kumar) రన్నరప్‌గా(Runer Up) నిలిచాడు. హీరోయిన్‌ మన్నారా చోప్రా(Mannara Chopra), నటి అంకిత లోఖండే(Ankitha Lokhande), హైదరాబాద్‌కు చెందిన అరుణ్‌(Arun) తర్వాతి ప్లేసుల్లో నిలిచారు. టైటిల్‌ను తృటిలో మిస్‌ చేసుకున్న అభిషేక్‌ కుమార్‌ పాపం బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. తన మాజీ ప్రేయసి ఇషా హౌస్‌లోకి రావడమే అభిషేక్‌కు టార్చర్‌ అనుకుంటే, ఆమెకు తోడుగా ఆమె ప్రియుడు సమర్థ కూడా పార్టిసిపెంట్‌ కావడం మహా టార్చర్‌! ఇద్దరూ కలిసి అభిషేక్‌కు నరకం చూపించారు. చుట్టూ కెమెరాలున్నా సిగ్గు ఎగ్గు లేకుండా ఇషా,సమర్థ్‌ ఎన్నో పిచ్చి చేష్టాలు చేశారు. ప్రజల దృష్టిలో చులకన అయ్యారు. ఇషా అయితే ఇదే ఛాన్స్‌ అనుకుని అభిషేక్‌కు మెంటల్‌ టార్చర్‌ పెట్టింది. అభిషేక్‌ ఆరోగ్య సమస్యను వెక్కిరిస్తూ వికృతంగా వ్యవహరించింది. వాళ్ల మాటలు, చేస్తున్న చేష్టలు కంపరమెత్తిస్తున్నా అభిషేక్‌ భరించాడు. ఒక సందర్భంలో మాత్రం భరించలేక సమర్థ్‌ చెంప మీద ఒక్కటేశాడు. లేటెస్ట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బిగ్‌బాస్‌ షోలో తను అనుభవించిన మానసిక వేదన(Mental torture) గురించి చెప్పుకొచ్చాడు అభిషేక్‌. 'నా జీవితంలో ఇషా మాల్వియా(Isha Malviya) అనే చాప్టర్‌ను ముగించేశాను. ఫినాలే రోజు హౌస్‌ లైట్లు ఆర్పేసి స్టేజీ మీదకు రమ్మన్నాడు బిగ్‌బాస్‌. అప్పుడే ఇషాను, ఆమెతో జరిగిన గొడవలను మర్చిపోవాలనుకున్నాను. అనవసర విషయాలను ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోవాలనుకోవడం లేదు. జీవితంలో, కెరీర్‌లో ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. మొదట్లో నా మానసిక ఆరోగ్యం మెరుగుపర్చుకునేందుకు థెరపీ తీసుకోవాలనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఇషా నా జీవితంలో నుంచి వెళ్లిపోయిందో అదే నాకు పెద్ద థెరపీలా ఉపయోగపడింది. తను వెళ్లిపోయాకే నా జీవితం ప్రశాంతంగా ఉంది. ప్రేమ అంటేనే ఇప్పుడు భయంగా ఉంది. ఇక ముందు ఏదైనా రిలేషన్‌షిప్‌లో అడుగుపెట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాను' అని అభిషేక్‌ తెలిపాడు.

Updated On 1 Feb 2024 6:30 AM GMT
Ehatv

Ehatv

Next Story