నాగచైతన్య(Nagachaithanaya), శోభితలకు(Shobitha) లేని సమస్య మహిళా కమిషన్‌కు ఎందుకొచ్చిందో!
నిజమే కదా! నాగచైతన్య(Nagachaithanaya), శోభితలకు(Shobitha) లేని సమస్య మహిళా కమిషన్‌కు ఎందుకొచ్చిందో! తెలంగాణలో మహిళలపై వేధింపుల విషయం పట్టించుకోకుండా వేణుస్వామికి నోటీసులు జారీ చేయడమేమిటని అప్పట్లోనే చాలా మంది అనుకున్నారు. ఇప్పుడు హైకోర్టు కూడా అదే అభిప్రాయాన్ని .. కాదు కాదు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. వేణు స్వామిపై(Venu swamy) మహిళా కమిషన్(Women Commission) కు ఓ ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. (అసలు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్ ఎందుకు ఫిర్యాదు చేసినట్టో). ఫిర్యాదు చేయడమే ఆలస్యం మహిళా కమిషన్ వేణుస్వామికి నోటీసులు జారీ చేసింది. దానిని సవాల్ చేస్తూ వేణుస్వామి హైకోర్టును(High court) ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు నాగచైతన్య శోభితలకు లేని సమస్య మీకెందుకంటూ ఫిలిం జర్నలిస్టులను ప్రశ్నించింది. మహిళా కమిషన్ నోటీసులు చెల్లవంటూ కోర్టు తీర్పు వెలువరించింది.