ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘వ్యూహం’ సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. శుక్రవారం సినిమా విడుదల చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) రూపొందించిన ‘వ్యూహం(Vyooham)’ సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు(Telangana High Court) బ్రేక్ వేసింది. శుక్రవారం సినిమా విడుదల చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ‘వ్యూహం’ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ ను రద్దు చేసింది. జనవరి 11 వరకూ ‘వ్యూహం’ సెన్సార్ సర్టిఫికెట్ సస్పెండ్ చేసింది. దీంతో జనవరి 11 వరకూ ‘వ్యూహం’ సినిమా విడుదల అవకుండా అడ్డుకట్ట వేసింది.
‘వ్యూహం’ సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలంటూ ఈ నెల 26న టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. చంద్రబాబు(Chandrababu) ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యూహం సినిమా ఉందని పిటిషన్‌లో లోకేష్(Nara Lokesh) పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్(CM Jagan) కు లబ్ధి చేకూరేలా.. ఆయన ప్రోద్భలతోంనే ‘వ్యూహం’ తీశారని పిటిషన్‌లో లోకేష్ పేర్కొన్నారు. లోకేష్ పిటిషన్ పై హైకోర్టులో 5 గంటలకు పైగా వాదనలు కొనసాగాయి. లోకేష్ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు సినిమా విడుదలకు బ్రేక్ వేస్తూ తీర్పునిచ్చింది.