సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు హీరోయిన్ మృణాళ్ ఠాకూర్(Mrunal Thakur). ఆమెను తెలుగు అమ్మాయిగానే భావించారు. దుల్కర్ సల్మాన్(dulqer Salman) హీరోగా వచ్చిన సీతారామం సూపర్‌హిట్టయ్యింది. దాంతో మృణాళ్ ఠాకూర్‌కు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి.

Mrunal Thakur
సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు హీరోయిన్ మృణాళ్ ఠాకూర్(Mrunal Thakur). ఆమెను తెలుగు అమ్మాయిగానే భావించారు. దుల్కర్ సల్మాన్(dulqer Salman) హీరోగా వచ్చిన సీతారామం సూపర్‌హిట్టయ్యింది. దాంతో మృణాళ్ ఠాకూర్‌కు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని(Nani) హీరోగా నటిస్తున్న హాయ్ నాన్న(Hi Nana) సినిమాతో పాటు విజయ్ దేవరకొండ(Vijay Devarkonda) కథానాయకుడిగా వస్తున్న వీడీ13(VD13) అనే సినిమాలో నటిస్తున్నారు మృణాళ్ ఠాకూర్. ఆగస్టు 1వ తేదీ ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా హాయ్ నాన్న టీమ్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మెహన్ చెరకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం వహిస్తున్నారు. ఇక గీతగోవిందం వంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన హీరో విజయ్ దేవరకొండ- దర్శకుడు పరశురామ్ కాంబినేషన్‌లోనే వీడీ 13 తెరకెక్కుతున్నది. ఈ సినిమాను దిల్‌రాజ్, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌లో మృణాళ్ ఠాకూర్ బర్త్‌డేను సెలబ్రెట్ చేశారు. ఈ వేడుకలో విజయ్ దేవరకొండ, పరశురామ్, హన్షిత పాల్గొన్నారు.
