మన హీరోయిన్లు(Heroines) నయా ట్రెండ్‌ సెట్‌ చేశారు. గతంలో పలువురు హీరోయిన్లు పెళ్లికి ముందు తల్లులు కాగా.. తాజాగా ఆ జాబితాలోకి అమలాపాల్ (Amala paul)వచ్చి చేరింది. గతంలో శ్రీదేవి(Sridevi), రేణూదేశాయ్‌(Renu desai), దియా మీర్జా(Dia mirza), నేహా దుపియా(Neha dhuphia), కొంకణా సేన్ శర్మ, సెలీనా జైట్లీ, నీనా గుప్తా, అమృతా అరోరా, మహిమా చౌదరి సైతం పెళ్లికి ముందు గర్భవతులు అయ్యారు. 

నవంబర్ 6, 2023న పెళ్లి చేసుకున్న అమలాపాల్‌.. తాను గర్భవతినంటూ(Pregnant) బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. అమలాపాల్ షేర్‌ చేసిన ఫొటోలను చూస్తే పెళ్లికి ముందే గర్భవతైనట్లు ఈజీగా తెలుస్తుంది.

దక్షిణాది సినిమాల్లో నటించి సక్సెస్‌ సాధించిన గోవా బ్యూటీ ఇలియానా(Ileana).. తన ప్రెగ్నెన్సీ కన్‌ఫాం అయిందని చెప్పే సమయానికి ఇలియానాకు పెళ్లి కాలేదు. ఆగస్ట్‌లో బిడ్డకు జన్మనిస్తే.. మేలో వివాహం(Marriage) చేసుకున్నారు.

కొడుకును కన్న తర్వాత ఐదేళ్లకు రేణు దేశాయ్‌ పవన్‌ కల్యాణ్‌ను(Pawan Kalyan) పెళ్లి చేసుకున్నారు. 'బద్రి'లో పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్ జంటగా నటించారు. సినిమా తర్వాత వీరిద్దరూ ప్రేమించుకొని చాలా కాలం సహ జీవనం చేశారు. అకిరా నందన్ 2004లో పుడితే 2009లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు

ఇక ఇదే తరహాలో శృతి హాసన్ తల్లిదండ్రులు కమల్ హాసన్‌(Kamal Haasan), సారిక కూడా ఉన్నారు. శృతి జన్మించిన తర్వాత వీరు పెళ్లి చేసుకున్నారు.

దివంగత హీరోయిన్‌ శ్రీదేవి సైతం వివాహం జరిగే సమయానికి 7 నెలల గర్భవతి. మొదటి భార్య మోనా నుంచి బోనీ కపూర్‌కు(Boney Kapoor) విడాకులు రాకపోవడంతో పెళ్లి ఆలస్యమైంది కానీ అప్పటికే ఆమె గర్భవతిగా ఉన్నారు.

హిందీ సినిమాల్లో ప్రత్యేక గీతాలతో పాపులరైన సెర్బియా భామ నటాషా మే 31, 2020లో క్రికెటర్ హార్దిక్ పాండ్యను పెళ్లి చేసుకున్నారు. జులైలో తల్లిదండ్రులు అయ్యారు.

Updated On 4 Jan 2024 5:08 AM GMT
Ehatv

Ehatv

Next Story