సినిమా అంటే ఏదో చేశాం అన్నట్టు కాదు.. తన పాత్రకు వెయిట్ ఉండాలి.. డైలాగ్స్ ఉండాలి.. హీరోయిన్ అంటే ఏదో గ్లామర్ బొమ్మ కాదు.. యాక్టింగ్ కు స్కోప్ ఉండాలీ అని కోరుకునే హీరోయిన్లలో సాయి పల్లవి(Sai Pallavi) ఒకరు. పాత్ర మంచిగా ఉంటేనే సినిమా చేస్తుంది సాయి. ఎంత స్టార్ హీరో అయినా.. తనకు నటించే స్కోప్ లేకపోతే నో చెప్పేస్తుంది. ఇలానే ఇండస్ట్రీని ఆకర్షిస్తోంది బ్యూటీ. ప్రేమమ్ సినిమా(Premam  Movie)తో ఎంట్రీ ఇచ్చి.. సౌత్ ను ఏలేస్తోంది.

ఫిదా సినిమా(Fidaa Movie)తో తెలుగులో తిరుగు లేని ఇమేజ్ సాధించింది సాయి పల్లవి. అంతకు ముందు ఎన్ని సినిమాలు చేసినా.. ఈసినిమాతో టాలీవుడ్ అంతా ఆమెకు ఫిదా అయ్యింది. తెలుగులో కూడా బిజీ హీరోయిన్ అయిపోయింది సాయి పల్లవి. ఎం.సి.ఎ, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ లాంటి హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్ అయిపోయింది సాయి పల్లవి. కమర్సియల్ సినిమాలు చేసే.. గ్లామర్ షో హీరోయిన్లు మాత్రమే స్టార్ డమ్ సాధిస్తారు అన్న పేరును చెరిపేసి.. ఇలా కూడా హీరోయిన్ అవ్వచ్చు.. స్టార్ డమ్ సాధించవచ్చు అని నిరూపించింది సాయి పల్లవి. అందుకే వరుస ఆఫర్లు ఆమెను వెంటాడుతూ వస్తున్నాయి.

సాయి పల్లవితో సినిమా అంటే.. కొన్ని షరతులు ఉంటాయి.. అందులో ముఖ్యంగా లిప్ లాక్ లు, ఇంటిమేట్ సీన్స్ కు తాను దూరంగా ఉంటాను అన్నారు సాయి. అయితే ఇంత స్ట్రీక్ట్ గా ఉండే సాయి పల్లవి మాత్రం ఒక హీరోకు లిప్ లాక్ ఇవ్వక తప్పలేదట. ఆమె కెరీర్ లో లిప్ లాక్ ఇచ్చిన హీరో ఎవరో కాదు.. అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya). వీరి కాంబినేషన్లో వచ్చిన లవ్ స్టోరీ మూవీ(Love Story Movie)లో ఓ సన్నివేశంలో చైతన్యకి ఈమె లిప్ కిస్(Lip Kiss) ఇవ్వడం జరిగిందట. కానీ ఆ సన్నివేశాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల(Sekhar Kammula) చాలా సెన్సిబుల్ గా హ్యాండిల్ చేయడం వల్ల.. అది ఒరిజినల్ లిప్ లాక్ సన్నివేశంలా కనిపించలేదని తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. సాయి పల్లవి ఏంటీ.. లిప్ లాక్ ఇవ్వడం ఏంటీ అని ఆశ్చర్య పోతున్నారు. గూగుల్ లో వెతికి మరీ ఇది నిజమా అని కన్ ఫార్మ్ చేసుకుంటున్నారు. వరుస ఆఫర్ల వచ్చినా.. తాను అనుకున్న కాన్సెప్ట్ ను మాత్రం వదలను అంటోంది బ్యూటీ ఏమాత్రం తగ్గడంలేదు సాయి పల్లవి.

Updated On 27 April 2023 12:33 AM GMT
Ehatv

Ehatv

Next Story