అక్కినేని నాగ చైతన్య(Naga chaitanya) హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా యంగ్ డైరెక్టర్ చందూ మొండేటి రూపోందిస్తున్న సినిమా తండేల్. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో.. తెరకెక్కుతున్న తండేల్ సినిమాలో సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. అవ్వడమే కాదు.. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యింది కూడా. ఇక ఈమూవీ షూటింగ్ ప్రస్తుతం కర్ణాటక లోని గోకర్ణ ప్రాంతంలో జరుగుతుండగా తాజాగా సెట్స్ లోకి హీరోయిన్ సాయి పల్లవి ఎంట్రీ ఇచ్చారు.

అక్కినేని నాగ చైతన్య(Naga chaitanya) హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా యంగ్ డైరెక్టర్ చందూ మొండేటి రూపోందిస్తున్న సినిమా తండేల్. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో.. తెరకెక్కుతున్న తండేల్ సినిమాలో సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. అవ్వడమే కాదు.. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యింది కూడా. ఇక ఈమూవీ షూటింగ్ ప్రస్తుతం కర్ణాటక లోని గోకర్ణ ప్రాంతంలో జరుగుతుండగా తాజాగా సెట్స్ లోకి హీరోయిన్ సాయి పల్లవి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ ప్రాంతం ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. మరీ ముఖ్యంగా బీచ్ వ్యూ.. సూర్యాస్తమయం(Sunset), సూర్యోదయాలు(Sunrise) ఇక్కడ అద్భుతంగా ఉంటాయి. దాంతో షూటింగ్ విరామ సమయంలో సాయంత్రం సూర్యాస్తమయం వేళ అక్కడి బీచ్ అందాలను ఎంజాయ్ చేసింది సాయి పల్లవి. సాయి పల్లవి సూర్యుడు సముద్రం ముగ్గురు కలిసి ఓ పిక్ దిగారు. ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియాలో(Social media) వైరల్ అవుతోంది.

ఇక తండేల్ మూవీ షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నారు మేకర్స్. మూవీ కోసం చైతూ చాలా కష్టపడ్డాడు. ఎంతో పీల్డ్ వర్క్(Field work) చేశాడు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీలో నాగచైతన్య జాలరి పాత్రలో నటిస్తుండగా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈమూవీని గీత ఆర్ట్స్ బ్యానర్(Geeta arts) పై.. భారీ బడ్జెట్ తో గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. దర్శకుడు చందూ మొండేటి(Chandu Mondeti) ఈ మూవీతో చైతూను గట్టిగా లిఫ్ట్ చేయాలని ట్రై చేస్తున్నాడు. ఎలాగైనా హిట్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాడు. ఇక ఈసినిమా వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక ఈ మధ్య ప్లాప్ లతో సవాసం చేస్తున్న నాగచైతన్య ఈసినిమాతో సాలిడ్ హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు.

Updated On 30 Dec 2023 8:49 AM GMT
Ehatv

Ehatv

Next Story