నందమూరి బాలకృష్ణ(Balakrishna) కొత్త సినిమా కోసం అభిమానులు కళ్లల్లో వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి పండుగకు వీర సింహారెడ్డి(Veera simha reddy) రిలీజ్‌ అయ్యింది. సినిమా హిట్‌ టాక్‌ను తెచ్చుకుంది. ఇప్పుడు భగవంత్‌ కేసరి(Bhagavanth Kesari) సినిమా షూటింగ్‌లో బాలయ్య బిజీగా ఉన్నారు.

నందమూరి బాలకృష్ణ(Balakrishna) కొత్త సినిమా కోసం అభిమానులు కళ్లల్లో వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి పండుగకు వీర సింహారెడ్డి(Veera simha reddy) రిలీజ్‌ అయ్యింది. సినిమా హిట్‌ టాక్‌ను తెచ్చుకుంది. ఇప్పుడు భగవంత్‌ కేసరి(Bhagavanth Kesari) సినిమా షూటింగ్‌లో బాలయ్య బిజీగా ఉన్నారు. అనిల్‌ రావిపూడి(anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌(Kajal Aggarwal), శ్రీలీల(sreeleela) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అర్జున్‌ రాంఫాల్‌(Arjun Ramphal) కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ నటించబోయే 109 చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను(Rakul preeth singh) హీరోయిన్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంది. బాబీ కొల్లి(Bobby Kolli) దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌(sithara Entertainments) సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రంలో కూడా ఇద్దరు కథానాయికలు నటిస్తున్నారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌తో పాటు సంయుక్త మీనన్‌ను(samyuktha menon) మరో హీరోయిన్‌గా తీసుకునే అవకావం ఉందని తెలిసింది. ప్రస్తుతం రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఇండియన్‌-2(Indian-2), ఆయలాన్‌(alayan) సినిమాలలో నటిస్తున్నారు.

Updated On 27 Jun 2023 1:01 AM GMT
Ehatv

Ehatv

Next Story