సౌందర్య(Soundarya)తో తన జ్ఞాపకాల గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు సౌత్ స్టార్ సీనియర్ హీరోయిన్ ప్రేమ(Actress Prema). సౌందర్య గురించి ఎన్నో విషయాలు పంచుకున్న ఆమె.. తన చావుగురించి భయంకరమైన విషయాలు గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ(South Film Industry)లో సౌందర్య మరణం ఊహించని పరిణామం. దాదాపు పది పదిహేనేళ్లు.. దక్షిణాది సినిమాలో తెలుగు,తమిళ, కన్నడ ఇండస్ట్రీలను ఏలిన సౌందర్య ప్రమాదంలో అకాల మరణం అభిమానులను కలచివేసింది.
సౌందర్య(Soundarya)తో తన జ్ఞాపకాల గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు సౌత్ స్టార్ సీనియర్ హీరోయిన్ ప్రేమ(Actress Prema). సౌందర్య గురించి ఎన్నో విషయాలు పంచుకున్న ఆమె.. తన చావుగురించి భయంకరమైన విషయాలు గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ(South Film Industry)లో సౌందర్య మరణం ఊహించని పరిణామం. దాదాపు పది పదిహేనేళ్లు.. దక్షిణాది సినిమాలో తెలుగు,తమిళ, కన్నడ ఇండస్ట్రీలను ఏలిన సౌందర్య ప్రమాదంలో అకాల మరణం అభిమానులను కలచివేసింది. ఇంత కాలం అయినా.. ఆమెను మర్చిపోలేకపోతున్నారు అభిమానులు. కొంత మంది ఆమెను తలుచుకుని ఇప్పటికీ కన్నీరు పెడుతున్నారు. అందులో సామాన్యులతో పాటు.. ఫిల్మ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హీరోయిన్ ప్రేమ... సౌందర్యను చివరి చూపు కూడా సరిగ్గా చూడలేకపోయామని దిగ్భ్రాంతికర సంగతులు పంచుకున్నారు.
సౌందర్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ప్రేమ. ఆమె మరణం అందరిని షాక్ కు గురి చేసిందని.. నాకు తెలిసి సౌందర్యను ప్రేమించే వారికి ఇంతకంటే అత్యంత విషాదకరమైన ఘటన ఏముంటుందన్నారు. అంతే కాదు సౌందర్య మరణం తనను కలిచివేసిందన్నారు ప్రేమ. చివరి చూపు కూడా సరిగ్గా చూడలేకపోయాన్నన్నారు. ప్రేమ మాట్లాడుతూ.. సౌందర్యను చివరి చూపు చూడటానికి ఆమె నివాసానికి వెళ్ళాను. సౌందర్య, ఆమె తమ్ముడు డెడ్ బాడీస్ బాక్సులలో ఉంచారు. సౌందర్యకు తల లేదు. కేవలం ఆమె పెట్టుకున్న వాచ్ ని చూసి సౌందర్య డెడ్ బాడీ అని గుర్తించారని... ప్రేమ అన్నారు.
ఎప్పుడూ నవ్వుతూ.. అందంగదా కనిపించే సౌందర్యను అలా చూసి తట్టుకోలేకపోయానన్నారు ప్రేమ. అంతే కాదు సౌందర్య ఎప్పుడూ అందంగా కనిపించడానికి ఇష్టపడతారు. షూటింగ్ లో షాట్ గ్యాప్ లో కూడా మేకప్ పోకుండా టచ్ అప్ చేసుకునేవారు. లుక్ పర్ఫెక్ట్ గా ఉండాలనుకునేవారు. కాని అటువంటి అందాల నటి చివరి క్షణాలు ఇంత ధారుణంమవుతాయి అని అనుకోలేదు. ముఖ్యంగా ఆమె అందమైన ముఖం కనిపించకుండా పోయింది. అసలు ఆమె బాడీకి తల లేకుండా పోయింది. సౌందర్య మరణం తర్వాత జీవితం అంటే ఇంతేనా అనిపించింది. ఆర్టిస్ట్ జీవితాలు ఇంతే. మనం చనిపోయాక పట్టుకుపోయేది కర్మ, గౌరవం మాత్రమే అని చెపుతూ.. ప్రేమ బావోధ్వేగానికి లోనయ్యారు.
ఇక వరుస సినిమాలతో టాలీవుడ్ లో తన కంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు సౌందర్య. 2004 ఏప్రిల్ 17న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె మరణించారు. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చిన సౌందర్య.. బెంగళూరు నుంచి కరీంనగర్ వచ్చే క్రమంలో .. హెలికాప్టర్ టేకాఫ్ అవ్వగానే పేలిపోయి ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదంలో సౌందర్య సోదరుడు కూడా మరణించారు.