హీరోయిన్‌ మన్నారా చోప్రాకు(Manara Chopra) వేదికపైనే అందరూ చూస్తుండగానే డైరెక్టర్‌ ఎ.ఎస్‌. రవికుమార్‌ చౌదరి(AS Ravikumar Chowdhary) ముద్దు పెట్టుకున్న విషయం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మీడియా ముందే ఆ డైరెక్టర్‌ చేసిన పనిని చాలా మంది అసహ్యించుకున్నారు. ఈ వీడియో వైరల్‌ కావడంతో రవికుమార్‌ చౌదరి ట్రోలింగ్‌ కూడా గురయ్యారు.

హీరోయిన్‌ మన్నారా చోప్రాకు(Mannara Chopra) వేదికపైనే అందరూ చూస్తుండగానే డైరెక్టర్‌ ఎ.ఎస్‌. రవికుమార్‌ చౌదరి(AS Ravikumar Chowdhary) ముద్దు పెట్టుకున్న విషయం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మీడియా ముందే ఆ డైరెక్టర్‌ చేసిన పనిని చాలా మంది అసహ్యించుకున్నారు. ఈ వీడియో వైరల్‌ కావడంతో రవికుమార్‌ చౌదరి ట్రోలింగ్‌ కూడా గురయ్యారు. ఇంత జరుగుతున్నా అతడిలో అపరాధ భావన కనిపించలేదు సరికదా హీరోయిన్‌ మన్నార చోప్రాకు, నాకు లేని నొప్పి మీకెందుకు అంటూ మరోసారి చిల్లర కామెంట్లు చేశాడు. తాజాగ ఒక యూట్యూబ్‌ ఛానల్‌కు హీరోయిన్‌ మన్నారా చోప్రా ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో మొదటిసారిగా మద్దు విషయంపై స్పందించారు. ఆ టైమ్‌లో డైరెక్టర్‌ రవికుమార్‌ తప్పుగా చేసి ఉంటాడని తాను అనుకోలేదని అన్నారు. మొదటి నుంచి తనను ఆయన బేటీ .. బేటీ అంటూ పిలిచేవారని చెప్పుకొచ్చారు మన్నారా చోప్రా.

అంతే కాకుండా ఆమెను సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఎన్నోసార్లు ఆయన మెచ్చుకున్నారని తెలిపారు. రాజ్ తరుణ్ హీరోగా తిరగబడరా సామీ సినిమాలో తన పాత్రే లీడ్ హీరోయిన్‌లా ఉంటుందని ఆయన కితాబు ఇచ్చినట్లు మన్నారా పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయన ముద్దు పెట్టిన తర్వాత తాను వెళ్లిపోగానే అసలు అక్కడ ఏం జరుగుతోందో కూడా అర్థం కాలేదని చెప్పారు. ఈ వీడియోలో తన రియాక్షన్ చూస్తే ఎవరికైనా అర్ధం అవుతుందని చెప్పింది. తనకు ఇలా జరగడం ఇదే తొలిసారి అంటూ డైరెక్టర్‌ రవికుమార్‌ చౌదరి ప్రవర్తనను తప్పుగా అర్థం చేసుకోలేదని మన్నార చోప్రా తెలిపారు. ఇంతకు ముందు బాలకృష్ణతో వీరభద్ర, గోపీచంద్‌తో యజ్ఞం, సాయిధరమ్ తేజ్‌తో పిల్లా నువ్వు లేని జీవితం వంటి సినిమాలు తీశాడు డైరెక్టర్‌ ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి.

Updated On 2 Sep 2023 12:57 AM GMT
Ehatv

Ehatv

Next Story