స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్(Actress Keerthy Suresh) వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. దక్షిణాదిన అన్ని భాషల్లోనూ ఆమె నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఓ పక్క గ్లామర్ పాత్రలు పోషిస్తూనే మరో పక్క నటనకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటున్నారు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఓ పక్క నటిగా దూసుకుపోతున్నా,
స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్(Actress Keerthy Suresh) వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. దక్షిణాదిన అన్ని భాషల్లోనూ ఆమె నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఓ పక్క గ్లామర్ పాత్రలు పోషిస్తూనే మరో పక్క నటనకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటున్నారు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఓ పక్క నటిగా దూసుకుపోతున్నా, మరోపక్క ఆమె చుట్టూ రూమర్స్ అల్లుకుంటున్నాయి. మొన్నటి వరకు ప్రేమ, ప్రేమికుడు, పెళ్లి వంటి ప్రచారం జోరుగా జరిగింది. వీటిని ఎంత ఖండిస్తూ వస్తున్నా సోషల్ మీడియాలో ఎవరో ఒకరు రాస్తూనే ఉన్నారు. ఇలాంటి వార్తలు చదువుతుంటే బాధగా ఉంటుందని కీర్తి సురేశ్ చెబుతున్నా రాతగాళ్లు మారడం లేదు. తెలుగులో రీసెంట్‌గా దసరా సినిమాలో నటించిన కీర్తి అందులో తన పాత్రను అద్వితీయంగా పోషించింది. ఇప్పుడు తమిళంలో పలు సినిమాల్లో నటిస్తోంది. ఈ వారం ఆమె కథనాయికగా నటించిన మామన్నన్ సినిమా రాబోతున్నది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) ఇందులో హీరో. ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. మామన్నన్‌లో ప్రధాన పాత్రను వడివేలు పోసించారు. సెల్విమారన్ దీనికి దర్శకుడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో కీర్తి సురేశ్ ముమ్మరంగా పాల్గొంటున్నారు. మామన్నన్ ఓ రాజకీయ నేపథ్యంలో సాగే కథా చిత్రమని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేశ్ చెప్పారు. ఇందులో తనది చాలా సీరియస్ పాత్ర అని కూడా చెప్పారు. ఇక ముందు తనకు ఇలాంటి పాత్రలే వస్తాయేమోనన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. చాలా మంది తనను రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమైనా ఉందా అని అడుగుతున్నారని, ఆ విషయం గురించి ఆలోచించాలని కీర్తి తెలిపారు. దీంతో భవిష్యత్తులో ఆమె రాజకీయాల్లోకి వస్తారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఉదయనిధి స్టాలిన్‌తో కీర్తికి మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది.. రాబోయే రోజుల్లో ఆమె డీఎంకేలో చేరవచ్చనే ప్రచారం జరుగుతోంది. గతంలోనూ కీర్తి సురేష్ బీజేపీలో చేరుతుందనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని కీర్తి తల్లి మేనక అప్పుడే చెప్పారు. తన కూతురుకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదని కూడా అన్నారు.