హీరోయన్‌ అంజలి(Anjali) ఏ పాత్ర పడితే ఆ పాత్ర ఒప్పుకోరు. తనకు నచ్చితేనే సినిమా చేస్తారు. నటనకు స్కోప్‌ ఉన్న పాత్రలను ఎంచుకుంటారు. పాత్రల ఎంపికలో ఆమె వైవిధ్యానికి ప్రాధాన్యతనిస్తారు. గత కొన్నేళ్లుగా ఆమె నటించిన సినిమాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. విష్వక్‌సేన్‌(vishwak sen) హీరోగా కృష్ణ చైతన్య(Krish chaithanya) దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రంలో అంజలి కీలక పాత్రలో నటిస్తున్నారు.

హీరోయన్‌ అంజలి(Anjali) ఏ పాత్ర పడితే ఆ పాత్ర ఒప్పుకోరు. తనకు నచ్చితేనే సినిమా చేస్తారు. నటనకు స్కోప్‌ ఉన్న పాత్రలను ఎంచుకుంటారు. పాత్రల ఎంపికలో ఆమె వైవిధ్యానికి ప్రాధాన్యతనిస్తారు. గత కొన్నేళ్లుగా ఆమె నటించిన సినిమాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. విష్వక్‌సేన్‌(vishwak sen) హీరోగా కృష్ణ చైతన్య(Krish chaithanya) దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రంలో అంజలి కీలక పాత్రలో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. శుక్రవారం అంజలి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె ఫస్ట్‌ లుక్‌ను(First look) చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ సినిమాలో రత్నమాల అనే పాత్రలో అంజలి కనిపించబోతున్నారు.

గ్రామీణ యువతిగా అంజలి నటిస్తున్నారు. ఈ పాత్ర మాస్‌ ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందట. రత్నమాల తన వెనుక దాచుకున్న రహస్యమేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుందని చిత్ర యూనిట్‌ అంటోంది. ఈ భారీ యాక్షన్‌ డ్రామా సినిమాలో విష్వక్‌ సేన్‌ ఓ క్రూరమైన పాత్రలో నటిస్తున్నారు. అంటే విలన్‌ అన్నమాట. అతడి పాత్ర చిత్రణ కొత్త పంథాలో ఉంటుందట. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమాకు సంగీతాన్ని యువన్‌శంకర్‌ రాజా అందిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Updated On 17 Jun 2023 4:28 AM GMT
Ehatv

Ehatv

Next Story