ఏదైనా సినిమా మనకు బాగా నచ్చిందంటే చూసిన సినిమానే మళ్లీ మళ్లీ చూస్తాం. అదే ఫిల్మ్ డైరెక్టర్లు అయితే.. ఆ సినిమాలో కంటెంట్ ఉండి బాగా ఆడుతుంది అనుకుంటే ఏ భాష సినిమా అయినా మళ్లీ తీయడానికి (రీమేక్ ) ఏమాత్రం వెనకాడరు మన డైరెక్టర్లు. ఇప్పటి వరకు మీరు సినిమాలనే రీమేక్ చేస్తే చూశారు.. కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే వెబ్ సిరీస్ లను కూడా రీమేక్ చేస్తున్నారు. ఏ దేశంలో సిరీస్ హిట్టయినా […]

ఏదైనా సినిమా మనకు బాగా నచ్చిందంటే చూసిన సినిమానే మళ్లీ మళ్లీ చూస్తాం. అదే ఫిల్మ్ డైరెక్టర్లు అయితే.. ఆ సినిమాలో కంటెంట్ ఉండి బాగా ఆడుతుంది అనుకుంటే ఏ భాష సినిమా అయినా మళ్లీ తీయడానికి (రీమేక్ ) ఏమాత్రం వెనకాడరు మన డైరెక్టర్లు. ఇప్పటి వరకు మీరు సినిమాలనే రీమేక్ చేస్తే చూశారు.. కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే వెబ్ సిరీస్ లను కూడా రీమేక్ చేస్తున్నారు.

ఏ దేశంలో సిరీస్ హిట్టయినా వాటి రైట్స్ కొనేందుకు మన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతే కాకుండా మన ఇండియన్ నేటివిటీకి తగ్గట్టుగా మన ఇడియన్స్ కి అర్ధమయ్యే విధంగా వాటిని మార్చి రిలీజ్ చేస్తున్నారు. అలా వచ్చిన చాలా వెబ్ సిరీస్ లు మన వాళ్లని ఎంగేజ్ చేస్తున్నాయి. మన ఆడియన్స్ కూడా అలాంటి సిరీస్ లనే చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

అమెరికన్ టెలివిజన్ సిరీస్ ‘ రే డొనవన్‘కు రీమేక్ గా తెలుగులో ‘రానా నాయుడు’ పేరుతో రెడీ అవుతోంది. ఈ సిరీస్ లో దగ్గుబాటి వెంకటేష్, రానా నటిస్తున్నారు. ఈ ఒరిజినల్ సిరీస్ లో వచ్చిన 7 సీజన్లు కూడా జనాలను బాగా ఆకట్టున్నాయి. ఇప్పటికే రిలీజైన ‘రానా నాయుడు’ సిరీస్ ట్రైలర్ జనాల్లో మంచి క్రేజ్ నే సంపాదించింది. నెట్ ఫ్లిక్స్ లో రాబోతున్న ఈ సిరీస్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.

బాలీవుడ్ లోకి ‘ది నైట్ మేనేజర్’ పేరుతో మరో సిరీస్ రీమేక్ అవుతుంది. బ్రిటీష్ సిరీస్ అయిన దీని ఒరిజినల్ నేమ్ తోనే ఈ సిరీస్ రాబోతుంది. ఇక ఇందులో అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, శోభిత ధూళిపాల నటిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ నే అందుకుంది. ఫిబ్రవరి 17న డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమవబోతుంది.

పాతాళ్ లోక్ సిరీస్ ఫేమ్ జైదీప్ అహ్లావత్ బ్రిటీష్ వెబ్ సిరీస్ ను రీమేక్ చేయబోతున్నారు. ‘ప్రెస్’ ఆధారంగా హిందీలో ‘ది బ్రోకెన్ న్యూస్‘ పేరుతో తీసుకురానున్నారు మేకర్స్. గతేడాది జీ5లో రిలీజైన సిరీస్ మంచి రేటింగ్ ను దక్కించుకుంది.

Updated On 4 Feb 2023 8:16 AM GMT
Ehatv

Ehatv

Next Story