భార్య ముచ్చట తీర్చడానికి భర్తలు ఏమైనా చేస్తారు. సత్యభామను సంతోషపెట్టడానికి శ్రీకృష్ణుడు ఏకంగా పారిజాత వృక్షాన్నే తెచ్చి ఇచ్చిన వైనం మనకు తెలిసిందే! అలాగని భార్యలందరూ ఖరీదైన బహుమతులేం కోరరు. అల్ప సంతోషులు చాలా మందే ఉంటారు. తమ చిన్నపాటి కోరికను నేరవేర్చినా చాలు బోల్డంత సంబరపడిపోతారు.

భార్య ముచ్చట తీర్చడానికి భర్తలు ఏమైనా చేస్తారు. సత్యభామను సంతోషపెట్టడానికి శ్రీకృష్ణుడు ఏకంగా పారిజాత వృక్షాన్నే తెచ్చి ఇచ్చిన వైనం మనకు తెలిసిందే! అలాగని భార్యలందరూ ఖరీదైన బహుమతులేం కోరరు. అల్ప సంతోషులు చాలా మందే ఉంటారు. తమ చిన్నపాటి కోరికను నేరవేర్చినా చాలు బోల్డంత సంబరపడిపోతారు. శ్రీమతి కోరిన చిన్న పాటి కోరకను నటుడు యశ్‌(Yash) తీర్చాడు. ఆమె ఐస్‌క్యాండీ(Ice candy) కావాలంది. అంతే ఆమె కోసం చిన్న కిరాణా షాపుకు(Petty store) వెళ్లి మరీ కొనిచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో(Social media) వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఫ్యామిలీతో కలిసి ఉత్తర కన్నడ జిల్లా భత్కల్‌లోని షిరాలీకి విహారానికి వెళ్లాడు యశ్‌. అక్కడ చిత్రపుర మఠాన్ని దర్శించకున్నారు. అప్పడు తన భార్య ఐస్‌ క్యాండీ అడిగారు. అంతే తను స్టార్‌ హీరోనన్న విషయాన్ని మర్చిపోయి దగ్గరలో ఉన్న చిన్న దుకాణానికి వెళ్లాడు. ఐస్‌ క్యాండీతో పాటు, కొన్ని చాక్లెట్లు(Choclate) కూడా కొన్నాడు. యశ్‌కు ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌లో తినగలిగే స్థోమత ఉంది. లక్షలు పెట్టి ఖరీదైన బహుమతులు కొనగలిగే సామర్థ్యం కూడా ఉంది. అయినా యశ్‌ మాత్రం సింపుల్‌గా ఉండటం ఆయన అభిమానులకు ఆనందాన్ని ఇస్తోంది. టెలివిజన్‌ సీరియల్స్‌లో గ్లామర్‌ ఫీల్డ్‌లోకి వచ్చిన యశ్‌ తర్వాత సినీరంగంలో అడుగుపెట్టాడు. స్టార్‌ హీరో అయ్యాడు. ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యారు. యశ్‌ నటించిన కేజీయఫ్‌ సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర వందల కోట్ల రూపాయలు వసూలు చేశాయి. ప్రస్తుతం యశ్‌ టాక్సిక్‌ అనే సినిమాలో నటిస్తున్నారు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

Updated On 17 Feb 2024 6:53 AM GMT
Ehatv

Ehatv

Next Story