గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో సీనియర్ హీరోయిన్ అంజలి(Anjali) కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మధ్యనే ఈమూవీ నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు టీమ్ ఈ టీజర్ లో విష్వక్ సేన్ లుంగీ కట్టుకొని మాస్ లుక్‌ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా విశ్వక్ సేన్ కు సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరట్ అవుతోంది.

ఈరెండు మూడేళ్ళలో..టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ హీరోలు పెళ్ళి పీటలెక్కుతూ వస్తున్నారు.. తాజాగా మరో మాస్ హీరో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు.

టాలీవుడ్‌లో చాలా చిన్న వయస్సులోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుని.. మాస్ ఇమేజ్ ను కొల్లగొట్టిన హీరో విష్వక్సేన్(Vishwaksen). అంతే కాదు హీరోగానే కాకుండా కుర్ర స్టార్ మల్టీ టాలెంట్ కూడా చూపిస్తుంటాడు. హీరోగా దర్శకుడిగా తనను తాను నిరూపించుకున్నాడు. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం విష్వక్సేన్ గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి(Gangs Of Godhavari) అనే సినిమాలో నటిస్తున్నాడు. కృష్ణచైతన్య డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినియాలో నేహాశెట్టి(Neha shetty) హీరోయిన్‌ గా నటిస్తోంది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో సీనియర్ హీరోయిన్ అంజలి(Anjali) కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మధ్యనే ఈమూవీ నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు టీమ్ ఈ టీజర్ లో విష్వక్ సేన్ లుంగీ కట్టుకొని మాస్ లుక్‌ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా విశ్వక్ సేన్ కు సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరట్ అవుతోంది. విశ్వక్ సేన్ పెళ్లి చేసుకోబోతున్నట్టు టాలీవుడ్ కోడై కూస్తోంది. అంతే కాదు ఈ విషయం తానే స్వయంగా ఇండైరెక్ట్ గా అనౌన్స్ చేయడం పెద్ద చర్చకు దారి తీస్తోంది.

తాను కుటుంబాన్ని మొదలు పెట్టబోతున్నానంటూ విష్వక్సేన్ నిన్న చేసిన ఓ ట్వీట్ టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఇన్నాళ్లుగా నాపై కురిపించిన ప్రేమ, మద్దతుకు నా అభిమానులు, శ్రేయోభిలాషులకు సర్వదా కృతజ్ఞుడిని. ఇప్పుడు జీవితంలో మరో కొత్త దశలోకి అడుగుపెట్టబోతున్నానని తెలియజేసేందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నేను ఫ్యామిలీ మొదలెట్టబోతున్నాను. వివరాలు త్వరలోనే వెల్లడిస్తాను అని తెలుపుతూ అబ్బాయి, అమ్మాయి కలిసున్న ఎమోజీని ఉంచాడు.

దీన్ని బట్టి విష్వక్ సేన్ త్వరలో పెళ్ళి(Marriage) చేసుకోబోతున్నట్టు చెప్పేసినట్టు అర్ధం అయ్యింది. ఇక ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశ్వక్ ఫ్యాన్స్ ఈ ట్వీట్ చూసి తెగ కుషీ అవుతున్నారు. మాస్ హీరో మ్యారేజ్ అంటూ పండగ చేసుకుంటున్నారు. ఈన్యూస్ ను వారే వైరల్ చేస్తున్నారు. మరి ఈ యంగ్ మాస్ హీరో చేసుకోబోయే అమ్మాయి ఎవరబ్బా అంటూ ప్రకటన చేస్తాడేమో అని ఎదురుచూస్తున్నారు.

Updated On 15 Aug 2023 5:06 AM GMT
Ehatv

Ehatv

Next Story