ప్రస్తుతం మిచౌంగ్ తుఫాన్ ప్రభావంత తమిళనాడు మునిగిపోయింది. చెన్నై నగరం సముద్రాన్ని తలపిస్తోంది. దాంతో పాలకులపై జనం మండిపడుతున్నారు. కనీస సౌకర్యాలు లేకుండా.. వరదపై ప్లానింగ్ లేకుండా చేశారని తిడుతున్నారు. జనాల గోందకు సెలబ్రిటీలు కూడా శృతి కలుపుతున్నారు అందులో భాగంగా హీరో విశాల్.. అదరిపోయే పోస్ట్ ఒకటి పెట్టాడు. చెన్నై మేయర్ ప్రియా రాజన్ ను టార్గెట్ చేస్తూ..

తమిళ స్టార్ హీరో విశాల్(Vishal) కు కోపం వచ్చింది. తమిళనాట తుఫాను ప్రభావంతో జనజీవనం అల్లకల్లోలం అవుతోంది. తిండి,నీరు, కరెంట్ లేక జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఈక్రమంలో విశాల్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. అందరిని ఆలోచింపచేస్తోంది. ఇంతకీ విశాల్ ఏమంటున్నాడంటేు..

ప్రస్తుతం మిచౌంగ్ తుఫాన్ ప్రభావంత తమిళనాడు మునిగిపోయింది. చెన్నై నగరం సముద్రాన్ని తలపిస్తోంది. దాంతో పాలకులపై జనం మండిపడుతున్నారు. కనీస సౌకర్యాలు లేకుండా.. వరదపై ప్లానింగ్ లేకుండా చేశారని తిడుతున్నారు. జనాల గోందకు సెలబ్రిటీలు కూడా శృతి కలుపుతున్నారు అందులో భాగంగా హీరో విశాల్.. అదరిపోయే పోస్ట్ ఒకటి పెట్టాడు. చెన్నై మేయర్ ప్రియా రాజన్ ను టార్గెట్ చేస్తూ.. ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ విశాల్ ఏమని పోస్ట్ పెట్టాడంటే..

'డియర్ ప్రియా రాజన్ (చెన్నై మేయర్), గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కమిషనర్, ఇతర అధికారులకు.. మీ నివాసాల్లోకి వరద నీరు రావడం లేదని అనుకుంటున్నా. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్లలో హ్యపీగా సేఫ్ గా భావిస్తున్నా. మీ ఇళ్లకు కరెంట్, ఆహారం ఎలాంటి లోటు లేకుండా అందుతోందని భావిస్తున్నా. అయితే, సిటీలో మీతో పాటు నివసిస్తున్న ఇతర ప్రజలు మాత్రం మీ మాదిరి సురక్షితంగా లేరు. మీరు చేపట్టిన స్టార్మ్ వాటర్ డ్రెయిన్ ప్రాజెక్ట్ సింగపూర్ కోసమా లేక చెన్నై కోసమా? అని అన్నారు.

అంతే కాదు 2015లో భారీ వర్షాల కారణంగా విపత్తు వచ్చినప్పుడు ప్రతీ ఒక్కరు రోడ్ల మీదకు వచ్చి ప్రజలకు సాయం అందించాం. అది జరిగిన 8 ఏళ్ల తర్వాత పరిస్థితి మరింత ఘోరంగా తయారయింది. ఈ సారి కూడా బాధితులకు మేమంతా ఆహారం, నీటిని పంపిణీ చేసి వారిని ఆదుకుంటాం. అయితే, ఈ సారి ప్రజా ప్రతినిధులంతా వారివారి నియోజకవర్గాల్లో బయటకు వచ్చి బాధితులకు అండగా నిలుస్తారని ఆశిస్తున్నా. బాధిత ప్రజల్లో భయం, ఆందోళనను కాకుండా... విశ్వాసాన్ని నింపాలని కోరుకుంటున్నా' అని చెప్పారు. ప్రస్తుతం విశాల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం తమిళ,ఆంధ్రా ప్రాంతాలను మిచౌంగ్ తుపాను ముంచెత్తుతోంది. తుఫాను కారణంగా.. చెన్నై స్తంభించిపోయింది. నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. బాధిత ప్రజలు ఆహారం, నీటి కోసం అలమటిస్తున్నారు. ఇంత టెక్నాలజీ పెరిగినా.. ఇలాంటి విపత్తులను ఎదుర్కొవడంలో పాలకులు విఫలం అవుతూనే ఉన్నారు. అయితే ఈ విషయంలో వారిపై సెటైర్లు పడుతున్నాయి. చాలా మంది డైరెక్ట్ గానే ఘాటు విమర్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర మేయర్ పై ప్రమఖ తమిళ హీరో విశాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెటైరికల్ గా పోస్ట్ పెట్టారు.

Updated On 6 Dec 2023 7:03 AM GMT
Ehatv

Ehatv

Next Story