Vijay Sethupathi : ఎవరి కథలోనో హీరో కాదు, ఆయన కథలో ఆయనే హీరో.. పవన్‌పై విజయ్ సేతుపతి కామెంట్స్
మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి (vijay sethupati)తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే! ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగల సత్తా ఉన్న నటుడు. రజనీకాంత్, (rajini kanth) కమలహాసన్ (kamal hasaan)వంటి మేటి నటుల ప్రశంసలు పొందిన విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం మహారాజ. ఈ సినిమా జూన్ 14 తేదీన తెలుగు,తమిళ భాషలలో విడుదల కానుంది.

Vijay Sethupathi
మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి (vijay sethupati)తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే! ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగల సత్తా ఉన్న నటుడు. రజనీకాంత్, (rajini kanth) కమలహాసన్ (kamal hasaan)వంటి మేటి నటుల ప్రశంసలు పొందిన విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం మహారాజ. ఈ సినిమా జూన్ 14 తేదీన తెలుగు,తమిళ భాషలలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్‌లలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు విజయ్ సేతుపతి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్(Pawan kalyan) గురించి ఒక్క మాటలో ఏం చెబుతారని ఓ విలేకరి అడిగారు. దానికి ఆయన పవర్‌స్టార్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని చెబుతూ పవన్ గురించి ఇంకా చాలా చెప్పారు. 'పవన్ కల్యాణ్ కష్టపడేతత్వాన్ని నేను చాలా గౌరవిస్తాను. ఎన్నికలలో పోటీ చేస్తున్నప్పుడు ఆయనపై చాలా ట్రోల్స్ వచ్చాయి. ఆయన తొడ కొట్టినప్పుడు రియల్ లైఫ్‌లో కూడా ఎంత మాసో అర్థమయ్యింది. ఆయన ఎవరి కథలోనో హీరో కాదు. ఆయన సొంత కథలో ఆయనే హీరో. ఏం జరిగిన స్థిరంగా ఉండాలి. అది పవన్‌లో ఉంది. మీరంతా ఆ మానసిక స్థైర్యం కలిగి ఉండాలి. పవన్ సార్ గురించి నాకు అంతగా తెలియదు. కానీ నా కాంటాక్ట్స్ లిస్టులో ఉన్న కొందరు తెలుగు వాళ్లు వారి స్టేటస్‌లో పవన్ వీడియోలు పెట్టుకున్నారు. వాటిని చూసి ఏం జరిగిందని అడిగాను. వాళ్లు చాలా విషయాలు చెప్పారు. సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్, టీజింగ్ లాంటి విషయాలను ఎవరైతే ఎదుర్కొంటారో వారు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారని అర్థం. పవన్‌పై ఎన్నో పుకార్లు పుట్టించారు. వాటన్నింటినీ ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నారు. చివరకి ఆయనంటే ఏమిటో చూపించారు' అని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు. విజయ్ సేతుపతి చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
