ఈ ఏజ్ లో కూడా వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు విక్టరీ స్టార్ వెంకటేష్(Venkatesh).. మంచి మంచి కథలు సెలక్ట్ చేసుకుని సినిమాలు చేస్తున్న వెంకీ.. తాజాగా ఆయన డైరెక్టర్ వెంకట్ రెడ్డికి

ఈ ఏజ్ లో కూడా వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు విక్టరీ స్టార్ వెంకటేష్(Venkatesh).. మంచి మంచి కథలు సెలక్ట్ చేసుకుని సినిమాలు చేస్తున్న వెంకీ.. తాజాగా ఆయన డైరెక్టర్ వెంకట్ రెడ్డికి

కొంతకాలంగా వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు విక్టరీ వెంకటేశ్. చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫిలితాలను ఇస్తూ వస్తున్నాయి. వరుసగా గా నారప్ప'(Narappa) .. 'దృశ్యం 2′(Dhrushyam) .. 'ఎఫ్ 3′(F3) సినిమాలతో ఆయన తన దూకుడు కొనసాగిస్తున్నారు. అంతే కాదు మరోసారి విక్టరీ ఫ్యాన్స్ ను.. అలరించడానికి ఆయన 'సైంధవ్'(Saindhav) సినిమా ముస్తాబవుతోంది. శైలేశ్ కొలను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ ప్రధానంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఎప్పటి నుంచో హీరోగా టాలీవుడ్ ను ఏలుతున్న విక్టరీ స్టార్... వెంకటేష్ కి. కెరియర్ పరంగా ఇది వెంకటేశ్ కి 75వ సినిమా. ఇక 76వ సినిమాను కూడా వెంకటేశ్ సెట్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సురేందర్ రెడ్డి ఒక కథ చెప్పడం .. యాక్షన్ - ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంతో కూడిన ఆ కథ వెంకటేశ్ కి నచ్చడం జరిగిపోయిందని అంటున్నారు.

సురేందర్ రెడ్డి(Surender Reddy) మేకింగ్ చాలా స్టైలీష్ గా ఉంటుంది. యాక్షన్ సీన్స్ పై ఆయన మార్కు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. ఇద్దరి కాంబినేషన్లోని ప్రాజెక్టుకి సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయని చెబుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు. 'సైరా' .. 'ఏజెంట్' ఫ్లాపుల తరువాత సురేందర్ రెడ్డి చేస్తున్న ఈ సినిమా, ఆయనకి చాలా కీలకమైనదేనని చెప్పాలి.

Updated On 10 Oct 2023 5:24 AM GMT
Ehatv

Ehatv

Next Story