హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. వీరి ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. వీరు డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోబోతున్నారని... ఇటలీలో(Italy) మ్యారేజ్ జరగబోతోందని సమాచారం.

Varun Tej Bachelor Party In Spain
హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. వీరి ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. వీరు డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోబోతున్నారని... ఇటలీలో(Italy) మ్యారేజ్ జరగబోతోందని సమాచారం. మరోవైపు బ్యాచిలర్ లైఫ్ కు ముగింపు పలుకుతున్న నేపథ్యంలో, తన స్నేహితులకు వరుణ్ తేజ్ బ్యాచిలర్ పార్టీ(Bachelor Party) ఇస్తున్నాడు. స్పెయిన్ లో(Spain) తన స్నేహితులతో కలిపి పార్టీని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ పార్టీకి 40 మంది స్నేహితులు హాజరయినట్టు సమాచారం.
మరోవైపు వీరి మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. నవంబర్ మొదటి వారంలో పెళ్లి ఉంటుందని చెపుతున్నారు.ఇటలీలోని ఓ ప్యాలెస్ లో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్లి ఘనంగా జరగనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇరు కుటుంబాల్లో పెళ్లి పనులు మొదలై బిజీగా ఉన్నారు. వరుణ్, లావణ్య కూడా షాపింగ్ పనులు పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది నవంబర్ ఫస్ట్ వీక్ లోనే వీరి పెళ్లి జరగబోతుందని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ, త్వరలోనే ఈ అప్డేట్ ను అందించబోతున్నారని తెలుస్తోంది.
ఇక వరుణ్ తేజ్ చివరిగా ఎఫ్3, గని, గాండీవధారి అర్జున చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విభిన్న కథలు ఎంచుకుంటూ వస్తున్న వరుణ్ తేజ్ ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నారు. కానీ హిట్లు మాత్రం సొంతం చేసుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ‘ఆపరేషన్ వాలెంటైన్’(Operation Valentine)తో రానున్నారు. యాడ్ ఫిల్మ్ మేకర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్నాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. 2023 డిసెంబర్ 8న విడుదల కానుంది.
