తమిళ స్టార్ హీరో విజయ్(Thalapathy) రాజకీయాల్లోకి(Politics) అడుగుపెట్టారు. జెండా, ఎజెండా కూడా ఫిక్స్ అయ్యింది.
తమిళ స్టార్ హీరో విజయ్(Thalapathy) రాజకీయాల్లోకి(Politics) అడుగుపెట్టారు. జెండా, ఎజెండా కూడా ఫిక్స్ అయ్యింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగడానికి సర్వసన్నద్ధమవుతున్నాడు దళపతి విజయ్! సినిమాల నుంచి కూడా తప్పుకోబోతున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ విజయ్‌కు ఇంట్లో నుంచే సపోర్ట్ దొరకడం లేదన్నది వినడానికి ఆశ్చర్యంగా ఉంది. కానీ ఇది నిజం! కుటుంబం నుంచే ఆయనకు తలనొప్పి ఎదురవుతోంది. చాన్నాళ్లుగా విజయ్ తన ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు.. ఇలాగని చెప్పుకుంటున్నారు. అందుకు కారణం విజయ్ మేనేజరే! అతడే విజయ్‌ను పక్కదారి పట్టిస్తున్నాడనే కోపం కొడుకు సంజయ్‌కు(Sanjay) ఉంది. ఆ కోపంతోనే మేనేజర్‌ను సంజయ్ కొట్టాడట! . ఈ వ్యవహారం వెనుక ఇద్దరు హీరోయిన్లు ఉన్నారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అప్పట్నుంచే భార్య, కొడుకు విజయ్‌కు దూరంగా ఉంటున్నారు. తన సొంత కొడుకే తన మాట వినకుండాపోయినందుకు విజయ్ బాధపడుతున్నాడు. ఆ బాధతోనే సొంత కొడుకు తప్పుడు మాటలు విని చెడుమార్గం పట్టినట్టు, విలన్‌గా మారినట్టు, చివరకు తనే కొడుకును చంపినట్టు గోట్ సినిమా కథ రాయించుకున్నారని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. విజయ్ తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్(S Chandrashekar) గొప్ప దర్శకుడు. చిరంజీవితో చట్టానికి కళ్లులేవు, దేవాంతకుడు సినిమాలు రూపొందించింది ఈయనే! ఈయనకు కొడుకు విజయ్‌కు ఎప్పట్నుంచో పడటం లేదు. చాలా సందర్భాలలో ఈ విషయం బయటపడింది కూడా! తన కుమారుడిని ఎలాగైనా సరే దర్శకుడిని చేయాలని విజయ్ భార్య ప్రయత్నిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకాలో సందీప్ కిషన్‌తో ఓ ప్రాజెక్టు సెట్ చేయించారట! ఇప్పుడు ఎవరూ బయటపడటం లేదు కానీ ఎన్నికలంటూ వచ్చిన తర్వాత ఒక్కొక్కరుగా బయటకు వస్తారని అంటున్నారు. విజయ్ ఓవైపు, కుటుంబం మరోవైపు నిలుచున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.