బాల నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి నువ్వే కావాలి(Nuve Kavali) సినిమాతో కథానాయకుడిగా మారిన తరుణ్‌(Tharun) తొలి సినిమాతోనే బ్రహ్మాండమైన హిట్ కొట్టాడు. అయితే తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో నెమ్మదిగా ఫేడ్‌ అవుటయ్యారు. నటి రోజారమణి-నటుడు చక్రపాణి కుమారుడైన తరుణ్‌ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారారు. అందుకు కారణం ఆయన త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారంటూ సోషల్‌ మీడియాలో వార్తలు రావడమే!

బాల నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి నువ్వే కావాలి(Nuve Kavali) సినిమాతో కథానాయకుడిగా మారిన తరుణ్‌(Tharun) తొలి సినిమాతోనే బ్రహ్మాండమైన హిట్ కొట్టాడు. అయితే తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో నెమ్మదిగా ఫేడ్‌ అవుటయ్యారు. నటి రోజారమణి-నటుడు చక్రపాణి కుమారుడైన తరుణ్‌ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారారు. అందుకు కారణం ఆయన త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారంటూ సోషల్‌ మీడియాలో వార్తలు రావడమే! తన పెళ్లి(Marriage) గురించి వస్తున్న వార్తలపై తరుణ్‌ రియాక్టయ్యారు. ఆ వార్తలలో నిజం లేదని స్పష్టం చేశారు. తన పెళ్లి ఫిక్స్‌ అయితే స్వయంగా ఆ విషయాన్ని మీడియా ద్వారా పంచుకుంటానని అన్నారు. కొన్ని రోజులుగా మెగా డాటర్‌ నిహారికతో తరుణ్‌కు పెళ్లి కాబోతున్నదన్న వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. అలా వైరల్‌ అవ్వడానికి ఓ రీజన్‌ ఉంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తరుణ్‌ తల్లి రోజారమణి ' ఓ గొప్పింటి అమ్మాయితో తరుణ్‌ పెళ్లి ఉంటుంది' అని చెప్పారు. నాగబాబు కూతురు నిహారిక కూడా ఇటీవల విడాకులు తీసుకోవడంతో ఈ వార్త పుట్టుకొచ్చింది. మనసు మమత సినిమాతో బాలనటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు తరుణ్‌. మణిరత్నం తీసిన అంజలి, బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు తీసిన ఆదిత్య 369 తరుణ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 2000లో విడుదలైన నువ్వే కావాలితో హీరో అయ్యారు. వరుస ప్రేమకథ చిత్రాలలో నటించి లవర్‌బాయ్‌ ఇమేజ్‌ తెచ్చుకున్నారు. 2018లో విడుదలైన ఇది నా లవ్‌స్టోరీ తర్వాత నటన నుంచి బ్రేక్‌ తీసుకున్నారు.

Updated On 3 Aug 2023 5:08 AM GMT
Ehatv

Ehatv

Next Story