మెగాస్టార్ సినిమాలో మెరవబోతున్నాడు అక్కినేని హీరో సుశాంత్. భోళాశంకర్ సినిమాలో ప్రత్యేక పాత్ర చేయబోతున్నారట. ఇందులో నిజమెంత...?

మెగాస్టార్ సినిమాలో మెరవబోతున్నాడు అక్కినేని హీరో సుశాంత్. భోళాశంకర్ సినిమాలో ప్రత్యేక పాత్ర చేయబోతున్నారట. ఇందులో నిజమెంత...?

హీరోగా కెరీర్ సాగకపోవడంతో.. సెకండ్ హీరోగా స్టార్ హీరోల సినిమాల్లో కొత్త లైఫ్ ను స్టార్ట్ చేశాడు.. అక్కినేని హీరో సుశాంత్. అటు హీరోగా కూడా ప్రయత్నాలు చేస్తూ.. క్యారెక్టర్ రోల్స్ ను వదిలేయకుండా చేసుకుంటూపోతున్నాడు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో సెకండ్ హీరోగా ఆఫర్ కొట్టేశాడు. చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా భోళాశంకర్. మోహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తోంది. ఇక కీర్తి బోయ్ ఫ్రెండ్ గా సుశాంత్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

అక్కినేని హీరోల వారసత్వం తీసుకున్న సుశాంత్ కొన్ని సినిమాలు చేశాడు. కథల విషయంలో పక్కా ప్రణాళికతో వెళ్లి ఉంటే.. హీరోగా పాపులారిటీ సాధించేవాడు. కాని కెరీర్ ను కాస్త నిర్లక్ష్యం చేయడంతో.. 15 ఏళ్లు అవుతున్నా హీరోగా నిలబడలేకపోయాడు. కాళిదాసు సినిమాతో తెరంగేట్రం చేసిన సుశాంత్.. స్టార్ డమ్ ను మాత్రం అందుకోలేకపోయాడు. దాంతో యాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న సుశాంత్ ఈ మధ్యే అలవైకుంఠపురములో సినిమాతో సెకండ్ హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేశాడు.

సెకండ్ ఇన్నింగ్స్ లో రూటు మార్చాడు సుశాంత్. అల వైకుంఠపురములో సినిమాతో హీరోగా మారాడు. హీరోగా చేస్తూనే పెద్ద సినిమాల్లో ఇంపార్టెంట్ పాత్రల్లో మెరుస్తున్నాడు సుశాంత్. ప్రస్తుతం రవితేజ రావణాసుర సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ మూవీలో ఛాన్స్ కొట్టేశాడు. సుశాంత్‌కు కూడా పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే చేశాడట. ఈ సినిమాలో కీర్తి సురేష్‌కు బాయ్‌ఫ్రెండ్‌గా సుశాంత్‌ కనిపించనున్నాడట. అయితే తమిళంలో ఈ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుంది. కానీ సుశాంత్‌ కోసం ఈ పాత్రను కాస్త పెంచుతున్నారని టాక్ అంతేకాకుండా వీరి మధ్య ఒక పాట కూడా ఉండనున్నట్లు సమాచారం. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మాత్రం మేకర్స్‌ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Updated On 18 March 2023 5:09 AM GMT
Ehatv

Ehatv

Next Story