తిరుమల లడ్డూ వివాదం ఇంకా సమసిపోలేదు.
తిరుమల లడ్డూ వివాదం ఇంకా సమసిపోలేదు. సత్యం సుందరం(Satyam Sundaram) సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్(Hyderabad)కు వచ్చిన తమిళ హీరో కార్తీ (Hero Karthik)లడ్డూ అంశం సున్నితమైనదన, ఇప్పుడు మాట్లాడకూడదని యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు జవాబిస్తూ చెప్పాడు. తర్వాత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ఈ వ్యాఖ్యలపై సీరియస్ అవ్వడం, దానికి కార్తీ సారీ చెప్పడం జరిగాయి. ఇది జరిగిన కాసేపటికి మరో ట్వీట్ వైరల్ అయ్యింది. అది కార్తీ అన్న సూర్య పేరుతో ఉన్న ఎక్స్ అకౌంట్ నుంచి వచ్చినట్టుగా ఉంది. తన తమ్ముడు చేసిన తప్పుకు తాను కూడా క్షమాపణలు చెబుతున్నానని, పవన్‌కు మద్దతుగా తాను కూడా మూడు రోజుల దీక్ష చేస్తానని ట్వీట్‌లో చెప్పాడు సూర్య. నిమిషాల్లోనే ఇది వైరల్ అయ్యింది. లక్షల మంది చూశారు. జాగ్రత్తగా గమనిస్తే అది సూర్య అఫిషియల్ అకౌంట్ నుంచి వచ్చింది కాదని, ఎవరో ఫేక్ చేశారని తెలిసింది. ట్వీట్ చేసిన అకౌంట్ కు బ్లూటిక్ వెరిఫికేషన్ లేదు. సూర్య అకౌంట్‌కు ఉంటుంది. సూర్య అఫీషియల్ అకౌంట్ @Suriya_offl పేరుతో ఉంది. కానీ ట్వీట్ చేసిన అకౌంట్ మాత్రం @Suriya_offt ఐడీతో ఉంది. అంటే.. చివరి అక్షరం ఎల్ బదులుగా టి అని గుర్తించకుండా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఈ ట్వీట్ చేశారు.