తమిళ(Tamil) సూపర్ స్టార్ విజయ్ కాంత్(Vijay Kanth) హాస్పిటల్ లో ఉన్నారు. ఆయన పరిస్థితి సిరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాదు విజయ్ కాంత్ పై రకరకాల వదంతులు రాగా.. ఈ విషయంలో హీరో సూర్య స్పందించారు.

తమిళ(Tamil) సూపర్ స్టార్ విజయ్ కాంత్(Vijay Kanth) హాస్పిటల్ లో ఉన్నారు. ఆయన పరిస్థితి సిరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాదు విజయ్ కాంత్ పై రకరకాల వదంతులు రాగా.. ఈ విషయంలో హీరో సూర్య స్పందించారు.

విజయ్ కాంత్ అనారోగ్యం గురించి.. ఆయన పై వస్తున్న వదంతుల గురించి తమిళ సెలబ్రిటీలు వరుసగా స్పందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం గురించి స్టార్ హీరోలు ఆరా తీస్తున్నారు. విజయ్ కాంత్ భార్యకు ఫోన్ చేసి.. ధైర్యం చెపుతున్నారు. తాజాగా విజయ్ కాంత్ అనారోగ్యంపై తమిళ స్టార్ హీరో సూర్య(Suriya) స్పందించారు. విజయ్ కాంత్ పరిస్థితి గురించి ఆరా తీశారు. ఆయన కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన సతీమణికి(Wife) ఫోన్ చేసి విజయ్ కాంత్ ఆరోగ్య విషయాలను తెలుసుకున్నారు సూర్య. అలాగే సోషల్ మీడియాలో సూర్య ఓ పోస్ట్ షేర్ చేశాడు.

విజయ్ కాంత్ గురించి ఈవిధంగా పోస్ట్ పెట్టారు సూర్య.. అన్న విజయకాంత్ కోలుకోవాలని ప్రార్థించే కోట్లాది హృదయాల్లో నేనూ ఒకడిని. కోట్లాది మంది ప్రజల ప్రార్థనలు తప్పకుండా నెరవేరుతాయి. ఆయన పూర్తిగా కోలుకుంటారు. అని రాసుకొచ్చారు సూర్య.

ఇక తమిళనాట స్టార్ హీరోగా విజయ్ కాంత్ ఇమేజ్ గురించి తెలిసిందే.. లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకున్న హీరోలలో విజయ్ కాంత్ ఒకరు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో ఇంటికే పరిమితం అవ్వగా.. ఎన్నోసార్లు ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించి.. మళ్ళీ కోలుకున్నారు.. ఇక తాజాగా మరోసారి విజయ్ కాంత్ అనారోగ్యంతో హాస్పటల్(Hospital) లో చేరిన విషయం తెలిసిందే. గతకొంతకాలంగా విజయ్ కాంత్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యం పట్ల అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీఎండీకే(DMDK) అధినేతగా ఉన్న విజయకాంత్.. జలుబు జ్వరంతో హాస్పిటల్ లో చేరి.. గత 15 రోజులుగా హాస్పిటల్ లోనే ఉన్నారు. వెంటనే డిశ్చార్జ్ అవుతారు అనుకుంటే.. పరిస్థితి విషమించింది అంటున్నారు డాక్టర్లు.

ఈక్రమంలో విజయ్ కాంత్ ఆరోగ్యం పై ఎప్పటికప్పుడు వైద్యులు ప్రకటనలు విడుదల చేస్తున్నారు. విజయ్ కాంత్ ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలుపుతున్నారు.అయితే సోషల్ మీడియాలో మాత్రం స్టార్ సీనియర్ హీరో పై రకరకాల న్యూస్ లు వైరల్ అయ్యాయి. విజయ్ కాంత్ మరణించినట్టు కూడా కొంత మంది ప్రాచారం చేశారు. ఆయన కోమాలోకి వెళ్లారని మరికొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వైరల్ చేశారు. ఇక ఆయన చనిపోయారంటూ వచ్చిన పుకార్లపౌ ఇటీవలే ఆయన సతీమణి స్పందించారు. ఓ వీడియో ద్వారా ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని క్లారిటీ ఇచ్చారు.

Updated On 5 Dec 2023 3:49 AM GMT
Ehatv

Ehatv

Next Story