హీరో సిద్దార్థ్ (Siddharth), అదితిరావు హైదరీ (Aditi Rao Hydari) వీరిద్ధరూ డేటింగ్లో ఉన్నారని పుకారు ఉంది. ఈ రుమార్లను ఖండిస్తూనే.. ఎప్పుడుపడితే అప్పుడు మీడియాకు కనిపిస్తూ.. డేటింగ్లో ఉన్నట్టు తెగ హింట్లు ఇస్తున్నారు. రూమర్స్ పై సిద్దార్ధ్ ఎప్పుడు చెప్పేదానికంటే ఈ సారి రియాక్ట్ అయినదాని బట్టి చూస్తుంటే వీళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నారనేది నిజమే అనిపిస్తోంది. అవును మీరు విన్నది నిజమే ఈ టక్కర్ హీరో ఇన్‌డైరెక్ట్‌గానే హింట్లు ఇచ్చేస్తున్నాడు.
హీరో సిద్దార్థ్ (Siddharth), అదితిరావు హైదరీ (Aditi Rao Hydari) వీరిద్ధరూ డేటింగ్లో ఉన్నారని పుకారు ఉంది. ఈ రుమార్లను ఖండిస్తూనే.. ఎప్పుడుపడితే అప్పుడు మీడియాకు కనిపిస్తూ.. డేటింగ్లో ఉన్నట్టు తెగ హింట్లు ఇస్తున్నారు. రూమర్స్ పై సిద్దార్ధ్ ఎప్పుడు చెప్పేదానికంటే ఈ సారి రియాక్ట్ అయినదాని బట్టి చూస్తుంటే వీళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నారనేది నిజమే అనిపిస్తోంది. అవును మీరు విన్నది నిజమే ఈ టక్కర్ హీరో ఇన్‌డైరెక్ట్‌గానే హింట్లు ఇచ్చేస్తున్నాడు. ఆ వీడియో చూస్తుంటే అది నిజమే అంటున్నారు జనాలు.
ఇదిలా ఉంటే రీసెంట్గా తన సినిమా ‘టక్కర్’(Tucker) ప్రమోషన్స్ కోసం ఓ సింగింగ్ రియాలిటీ షోకు సిద్దార్ధ్ (Siddharth) అటెండ్ అయ్యాడు. ఈ షోలు సిద్దార్ధ్ మాటలు వింటుంటే అదితిరావు హైదరీతో ఉన్న బంధం నిజమేనని తెలుస్తోంది. యాంకర్ సిద్దార్ధ్ తో మీరు మీ లైఫ్‌లో కేవలం ఇంక ఆవిడతోనే డాన్స్ చేయాలని అనుకున్న ఆవిడ ఎవరన్నా ఉన్నారా అని అడిగితే.. అందుకు టక్కర్ హీరో వెంటనే ‘‘ మా ఊళ్లో అంటారు.. అదితిదేవో భవా అంటారు కదా’’ అని నవ్వుకుంటూ సమాధానం చెప్పాడు. దీంతో అక్కడ ఉన్నవాళ్లంతా నవ్వులు పువ్వులు పూయించారు.
Awwww did he just accept?? CUTE. ❤️❤️🧿#Siddharth pic.twitter.com/x9pVfv8SHT
— Shravani (@shravd05) June 9, 2023
ఇంకేముంది ఫ్యాన్స్ ఊరుకుంటారా లేదుకదా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేస్తున్నారు. డేటింగ్ రూమర్స్‌పై సిద్దార్ధ్ స్పందించడం ఇదే మొదటిసారి అయినప్పటికీ, అదితి మాత్రమే ఎప్పుడు వీటిని కొట్టిపారేస్తూనే వస్తుండేది. వాస్తవారిని ఆ బ్యూటీ సిద్దార్థ్‌తో డేటింగ్‌పై రియాక్ట్ అయింది. అయితే ఆమె రియాక్ట్ అవ్వడం రూమర్స్‌కు కాస్త్ ఆజ్యం పోసినట్టే అయింది. దానికితోడు ఆమె వాటిని రిజెక్ట్ చేయడం లేదన్నట్టు ఓ పెద్ద నవ్వు నవ్వేసింది.
అదితిరావు హైదరీ, సిద్ధార్థ్ మధ్య లవ్ ఎఫైర్ విషయానికి వస్తే.. అజయ్ భూపతి డైరెక్షన్ వచ్చిన మహా సముద్రం (Maha Samudram) సినిమా సెట్లో వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్టు సమాచారం. తరచూ వీళ్లిద్దరూ డేట్స్, సెలూన్లకు, లంచ్‌కు రెస్టారెంట్లకు, ఆడియో లాంచ్‌లకు, రీసెంట్గా శర్వానంద్ వివాహానికి, రిసెప్షన్ వంటి పబ్లిక్ ఈవెంట్లకు జంటగా వెళ్లున్నారు. దీనికితోడు సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్స్ కూడా చేసేస్తున్నారు. జైపూర్‌లో జరిగిన శర్వానంద్ (Sharwanand) పెళ్లికి వీరిద్దరూ జంటగా వెళ్లారు. వీళ్లిద్దరి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ పెళ్లివేడుకలో సరదాగా గడిపిన వీరిద్దరూ ఫ్రెండ్స్‌తో కలిసి కొన్ని సెల్ఫీలు కూడా దిగారు. ఇదంతా చూస్తున్న అభిమానులు వీళ్లిద్దరు ఎప్పుడు ఒక్కటవుతారా లేదా అని ఎదురుచూస్తున్నారు.. ఇక క్లైమాక్స్ ఎమవుతుందో చూడాలి మరి.