సిద్ధార్థ్(siddarth) తమిళ హీరోనే అయినప్పటికీ నువ్వొస్తానంటే నేనొద్దంటానా(Nuvostanante nen odhantana), బొమ్మరిల్లు(Bommarillu) వంటి సినిమాలతో తెలుగువారికి బాగా దగ్గరయ్యాడు. తెలుగులో వచ్చిన కొన్ని సినిమాలు విజయవంతం కాకపోయినా సిద్ధార్థ్‌కు ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు.

Takkar Movie
సిద్ధార్థ్(siddarth) తమిళ హీరోనే అయినప్పటికీ నువ్వొస్తానంటే నేనొద్దంటానా(Nuvostanante nen odhantana), బొమ్మరిల్లు(Bommarillu) వంటి సినిమాలతో తెలుగువారికి బాగా దగ్గరయ్యాడు. తెలుగులో వచ్చిన కొన్ని సినిమాలు విజయవంతం కాకపోయినా సిద్ధార్థ్‌కు ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు టక్కర్(Takkar) సినిమాతో మళ్లీ తెలుగువారి ముందుకు వస్తున్నాడు. జి.క్రిష్(G.Krish) డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో దివ్యాంశా కౌశిక్(Divyansha Kaushik) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే నెల 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. జనరల్‌గా సిద్ధార్థ్ సినిమాలలో ప్రేమ సన్నివేశాలు స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటాయి. ఈ సినిమాలో మాత్రం అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో సిద్ధార్థ్ సరికొత్తగా కనిపించబోతున్నాడు. తన కెరీర్‌లో ఇది మైలురాయిగా నిలిచిపోతుందని సిద్ధార్థ్ నమ్మకంగా చెబుతున్నాడు. ఈ చిత్రానికి నివాస్, కె.ప్రసన్నలు సంగీతం అందిస్తున్నారు.
