హీరో సిద్ధార్థ్(Siddhart), హీరోయిన్ అదితీరావు హైదరీ(Aditi rao hydari) ఓ ఇంటివారయ్యారు
హీరో సిద్ధార్థ్(Siddhart), హీరోయిన్ అదితీరావు హైదరీ(Aditi rao hydari) ఓ ఇంటివారయ్యారు. కలిసి ఏడు అడుగులు నడిచారు. వనపర్తిలోని రంగనాథ స్వామి ఆలయంలో(Ranganath swamy temple) చాలా నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను అదితి సోషల్ మీడియాలో షేర్ చేసింది. పట్టు వస్త్రాలలో వధూవరులు ఇద్దరూ చక్కగా ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో ఇదే వనపర్తిలోని రంగనాథ స్వామి ఆలయంలో నిశ్చితార్థం జరిగింది. అదితీ రావు హైదరీ పూర్వీకులది వనపర్తి. అందుకే ఇక్కడ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పెళ్లి కూడా ఇక్కడే చేసుకున్నారు. పెళ్లి ఎప్పుడు జరిగిందన్నది మాత్రం అదితి ప్రకటించలేదు. మహాసముద్రం సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ ప్రేమ ఇప్పుడు పెళ్లికి దారి తీసింది. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడమే విశేషం.