టాలీవుడ్ హీరో శర్వానంద్‌కు రోడ్డు ప్ర‌మాదంలో స్వ‌ల్ప గాయాల‌య్యాయి. శర్వానంద్‌ ప్రయాణిస్తున్న బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ కారు ఫిల్మ్‌నగర్ జంక్షన్ వద్ద అదుపుతప్పింది. ఈ ఘటనలో శర్వానంద్‌కు స్వల్పగాయాలు కాగా.. అక్కడున్నవారు హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు.

టాలీవుడ్(Tollywood) హీరో శర్వానంద్‌(Hero Sharwanand)కు రోడ్డు ప్ర‌మాదంలో స్వ‌ల్ప గాయాల‌య్యాయి. శర్వానంద్‌ ప్రయాణిస్తున్న బ్లాక్ కలర్ రేంజ్ రోవర్(Range Rover) కారు ఫిల్మ్‌నగర్ జంక్షన్(Film Nagar Junction) వద్ద అదుపుతప్పింది. ఈ ఘటనలో శర్వానంద్‌కు స్వల్పగాయాలు కాగా.. అక్కడున్నవారు హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న శర్వానంద్‌ కుటుంబసభ్యులు.. ఆసుపత్రికి చేరుకుని ఆరోగ్యపరిస్థితిని తెలుసుకున్నారు. మరోవైపు ఘటనాస్థలం నుంచి కారును సైతం తీసుకెళ్లినట్లు సమాచారం.

హీరో శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు ఫిల్మ్ నగర్‌ జంక్షన్ దగ్గర అదుపు తప్పిన సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అందరూ క్షేమంగా వున్నారు. కారుకి మాత్రం చిన్న గీతలు పడ్డాయి. చాలా స్వల్ప సంఘటన. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని టీమ్ శర్వానంద్(Team Sharwanand) ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

Updated On 28 May 2023 12:48 AM GMT
Yagnik

Yagnik

Next Story