ఈమధ్యే పెద్ద యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాడు సాయి ధరమ్ తేజ్.. అప్పటి వరకూ వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడ్డ సుప్రీం హీరో.. యాక్సిండెంట్ తరువాత అసలు సినిమాలు చేస్తాడా అన్న అనుమానం కలిగింది. కాని పట్టుదలతో కోలుకుని.. మళ్లీ సినిమాలు స్టార్ట్ చేశాడు సాయి తేజ్. అంతే కాదు విరూపాక్ష(Virupaksha) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మెగా హీరో.
మెగా హీరో... సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు. సినిమాలకు తాను గ్యాప్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించాడు. ఇంతకీ సాయి తేజ్ ఎందుకు గ్యాప్ ఇవ్వబోతున్నాడు.. కారణం ఏంటీ..?
ఈమధ్యే పెద్ద యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాడు సాయి ధరమ్ తేజ్.. అప్పటి వరకూ వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడ్డ సుప్రీం హీరో.. యాక్సిండెంట్ తరువాత అసలు సినిమాలు చేస్తాడా అన్న అనుమానం కలిగింది. కాని పట్టుదలతో కోలుకుని.. మళ్లీ సినిమాలు స్టార్ట్ చేశాడు సాయి తేజ్. అంతే కాదు విరూపాక్ష(Virupaksha) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మెగా హీరో.
ఈ ఏడాది విరూపాక్ష సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సాయి ధరమ్ తేజ్.. ఈ ఏడాది బ్రో(BRO) సినిమాతో రాబోతున్నాడు మేనమామ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో(Pawan Kalyan) కలిసి బ్రో సినిమాలో కలిసి నటిస్తున్నాడు సాయితేజ్. ఈ సినిమా ఈనెల 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సాయిధరమ్‌తేజ్ బ్రో మూవీ ప్రమోషన్స్ లో బిజీ అయిపోయాడు. ఈసందర్భంగా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. ఈక్రమంలో ఆయన ఓ షాకింగ్ విషయం వెల్లడించాడు. తన తదుపరి సినిమా కోసం సాయి తేజ్ ఆరు నెలల విరామాన్ని తీసుకోబోతున్నట్టు వెల్లడించాడు.
గతంలో జరిగిన యాక్సిడెంట్ తాలూకు సర్జరీ ఒకటి బ్యాలన్స్ ఉందని.. ఈలోగా తన శారీరక ఆరోగ్యంపై(Physical Health) పూర్తిగా శ్రద్ధ తీసుకుంటానని, రాబోవు సినిమా విషయంలో ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రావొద్దన్నదే తన ఉద్దేశ్యమని సాయిధరమ్‌తేజ్ తెలిపారు. ‘చిన్న సర్జరీ చేయించుకోవాల్సి ఉంది. ఈసారి మరింత బలంగా తిరిగొస్తా. నేను సంపూర్ణంగా కోలుకోవడానికి ఈ ఆరునెలల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటా’ అని సాయిధరమ్‌తేజ్ చెప్పారు.
ఇక బ్రో మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.. తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సిత్తం సినిమా రీమేక్ గా ఈసినిమా తెరకెక్కుతోంది. తమిళంలో ఈసినిమాను డైరెక్ట్ చేసిన సముద్రఖని.. తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తున్నాడు.బ్రో సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందో చూడాలి.