మాస్‌ మహారాజా రవితేజ(Ravi teja) ఈ మధ్య చేసిన సినిమాలేవీ గొప్పగా ఆడలేదు. క్రాక్‌(Krack) సినిమా తర్వాత రవితేజ న్యూవేవ్‌ కథలను ఎంచుకుంటున్నారని అనిపించింది. కానీ మళ్లీ అదే పాత చింతకాయ పచ్చటి టైపు కథలను ఎంచుకుంటున్నారు. ప్రేక్షకులు సినిమాలను తిప్పికొడుతున్నది ఇందుకే! ఖిలాడీ(Khiladi), రామారావు ఆన్‌ డ్యూటీ(Rama Rao On Duty) సినిమాలు ఎందుకు ఫెయిలయ్యాయంటే అందుకు కారణం కథ, కథనం పరమ బోరింగ్‌గా ఉండటం.. ఓ మాదిరిగా హిట్టయిన సినిమా ధమాకా(Dhamaka).

మాస్‌ మహారాజా రవితేజ(Ravi teja) ఈ మధ్య చేసిన సినిమాలేవీ గొప్పగా ఆడలేదు. క్రాక్‌(Krack) సినిమా తర్వాత రవితేజ న్యూవేవ్‌ కథలను ఎంచుకుంటున్నారని అనిపించింది. కానీ మళ్లీ అదే పాత చింతకాయ పచ్చటి టైపు కథలను ఎంచుకుంటున్నారు. ప్రేక్షకులు సినిమాలను తిప్పికొడుతున్నది ఇందుకే! ఖిలాడీ(Khiladi), రామారావు ఆన్‌ డ్యూటీ(Rama Rao On Duty) సినిమాలు ఎందుకు ఫెయిలయ్యాయంటే అందుకు కారణం కథ, కథనం పరమ బోరింగ్‌గా ఉండటం.. ఓ మాదిరిగా హిట్టయిన సినిమా ధమాకా(Dhamaka). ఈ సినిమా కూడా గొప్పగా ఏమీ లేదు. కాకపోతే గత సినిమాలో పోలిస్తే చాలా బెటర్‌. దీనికి తోడు శ్రీలీల(sreeleela) డాన్సులు, ఆమె అందాల ఆరబోత ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక రావణాసుర(Ravanasura) సినిమా కూడా ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కథ ఓకే అయినా కథనం మాత్రం బోరింగ్‌గా ఉంది. అందుకే సినిమా విజయవంతం కాలేకపోయింది. అయినప్పటికీ రవితేజ క్రేజ్‌ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు.

ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నారు రవితేజ. ఇదిలా ఉంటే తాజాగా ఆయన ఓ భారీ డీల్‌ను సెట్‌ చేసుకున్నారు. సక్సెస్‌ ఫుల్ ట్రాక్‌లో దూసుకుపోతున్న పీపుల్‌ మీడియా(People Media) నిర్మాణ సంస్థతో వంద కోట్ల రూపాయలతో డీల్‌ కుదుర్చుకున్నారు రవితేజ. పీపుల్‌ మీడియా సంస్థ.. రవితేజతో నాలుగు సినిమాల ఒప్పందం కుదుర్చుకుందట! అందుకోసం రవితేజకు వంద కోట్ల రూపాయల పెద్ద మొత్తం ఇచ్చినట్లు ఫిల్మ్‌ నగర్‌లో చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం రవితేజ చేస్తున్న ఈగల్‌ సినిమాను నిర్మిస్తుంది ఈ సంస్థే. దీని తర్వాత కలర్‌ ఫోటో సందీప్‌ రాజ్‌తో ఓ సినిమా తెరకెక్కబోతుంది. అదే విధంగా ఇద్దరు కొత్త దర్శకులతో మరో రెండు సినిమాలు ఈ సంస్థ ప్లాన్‌ చేసినట్లు టాక్‌. ప్రస్తుతం రవితేజ ఒక్కో సినిమాకు పాతిక కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే వంద కోట్ల డీల్‌ సెట్‌ చేసుకున్నట్లు తెలుస్తుంది. రవితేజ కెరీర్‌లో ఇంత పెద్ద మొత్తంలో డీలింగ్‌ జరగడం ఇదే మొదటిసారి. ఇది నిజమో కాదో తెలియదు కానీ సోషల్‌ మీడియాలో దీని గురించిన చర్చ జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం రవితేజ నటించిన టైగర్‌ నాగేశ్వరరావు రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. వంశీ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది.

Updated On 21 Jun 2023 6:04 AM GMT
Ehatv

Ehatv

Next Story