కొన్ని అరుదైన విషయాలు.. కొన్ని అరుదైన సంఘటనలు నిజంగా అరుధుగానే జరుగుతాయి. తాజాగా మాస్ మహారాజ్ రవితేజ(Ravi teja) కు సబంధించి అరుధైన గౌరవం పొందారు సీనియర్ హీరో.

కొన్ని అరుదైన విషయాలు.. కొన్ని అరుదైన సంఘటనలు నిజంగా అరుధుగానే జరుగుతాయి. తాజాగా మాస్ మహారాజ్ రవితేజ(Ravi teja) కు సబంధించి అరుధైన గౌరవం పొందారు సీనియర్ హీరో.

ప్రస్తుతం ఐసీసీ వరల్డ్ కప్(ICC World Cup) మ్యాచ్ లకు మన దేశం ఆతిధ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.. అందులో భాగంగా నేడు చెన్నైలో టీమిండియా(Team India), ఆస్ట్రేలియా(Australia) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానల్ కూడా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. అయితే, ఇవాళ ఓ విశేషం చోటుచేసుకుంది. టాలీవుడ్ నుంచి హీరోలను తీసుకువచ్చి.. క్రికెట్ క్రేజ్ పెంచాలని ప్లాన్ చేశారు టీమ్. దానికి తగ్గట్టుగానే టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఈ మ్యాచ్ కు కాసేపు కామెంటరీ చెప్పారు(Commentary).

కామెంటరీ ఛాంబర్ లో.. ఇతర వ్యాఖ్యాతలతో కలిసి అభిమానులకు సరదా వినోదం అందించారు రవితేజ. క్రికెట్ పై తన ఇష్టాన్ని వెల్లడించడంతో పాటు అనేక అంశాలను పంచుకున్నారు. రవితేజ వాయిస్ కామెంట్రీ రూపంలో వినిపించడంతో.. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యారు.

కాగా, మరే హీరోకు లభించని అరుదైన ఘనత రవితేజకు లభించింది. ఓ వరల్డ్ కప్ మ్యాచ్ కు కామెంటరీ చెప్పిన రవితేజ ఆమ్యాచ్ కే అదంతెచ్చారు. ఇక రవితేజ ఓక్కరే కాదు.. రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ(Bala Krishna) కూడా ఐపీఎల్(IPL) టోర్నీ క్రికెట్ మ్యాచ్ కు కామెంటరీ చెప్పి అందరిని అలరించాడు. ఇప్పుడు రవితేజ ఏకంగా ప్రపంచకప్ వంటి మెగాటోర్నీలో మైక్ పెట్టుకుని కామెంట్రీ ఇవ్వడం వైరల్ గా మారింది.

ఇక రవితేజ సినిమాల విషయానికి వస్తే.. ఆయన నటించిన తాజా సినిమా టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswar Rao) అక్టోబరు 20న రిలీజ్ కు రెడీ కాబోతోంది.. మరీ ముఖ్యంగా ఈసినమా ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ క్రికెట్ లైవ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక యంగ్ హీరోలక పోటీస్తూ.. రవితేజ దూసుకెళ్తున్నాడు. గెలుపు ఒటమి లెక్క చేయకుండా ..వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు.

Updated On 10 Oct 2023 1:19 AM GMT
Ehatv

Ehatv

Next Story