పెద్దవారికి నమస్కారం పెట్టడం సంస్కారం! కొందరు కాళ్లు మొక్కి ఆశీర్వాదం కూడా తీసుకుంటారు.

పెద్దవారికి నమస్కారం పెట్టడం సంస్కారం! కొందరు కాళ్లు మొక్కి ఆశీర్వాదం కూడా తీసుకుంటారు. ఉత్తర భారతంలో ఈ కల్చర్‌ కాసింత ఎక్కువగానే ఉంటుంది. ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే హీరో రానా(Hero rana) కొత్త సినిమాను ప్రకటించారు. ఈ సినిమాలో దుల్కర్‌ సల్మాన్‌(Dulquar salmaan), భాగ్యశ్రీ బోర్సేలు(Bagyashree borse) హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమానికి రానా కూడా హాజరయ్యారు. అలాగే ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ -2024 ప్రెస్‌ మీట్‌లో కూడా రానా పాల్గొన్నారు. ముంబాయిలో జరిగిన ఈ వేడకలో రానా స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌(Karan johar), బాలీవుడ్‌ బాద్షా షారూక్‌ఖాన్‌(Shah rukh khan) పాదాలకు నమస్కరించారు. తాను సౌత్‌ ఇండియన్‌ అని, అందుకే ఇలా చేశానని రానా చెప్పుకొచ్చారు. దుబాయ్‌లో షారూక్‌ ఇంటికి వెళ్లినప్పుడు తమను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారని రానా గుర్తు చేసుకున్నారు. షారూక్ నటుడు మాత్రమే కాదని మంచి మానవతావాది అని రానా ప్రశంసించారు.

Eha Tv

Eha Tv

Next Story