విరూపాక్ష(virupaksha) సినిమాతో తన సత్తా ఏంటో చూపించాడు సాయి ధరమ్ తేజ్(sai dharam tej). ఇక సాయితేజ్ పని అయిపోయింది అనుకున్నవారికి తన సినిమాతో గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఈసినిమాపై మెగా హీరోలు వరుసగా స్పందిస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ ఏమన్నాడంటే..?

విరూపాక్ష(virupaksha) సినిమాతో తన సత్తా ఏంటో చూపించాడు సాయి ధరమ్ తేజ్(sai dharam tej). ఇక సాయితేజ్ పని అయిపోయింది అనుకున్నవారికి తన సినిమాతో గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఈసినిమాపై మెగా హీరోలు వరుసగా స్పందిస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ ఏమన్నాడంటే..?

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మేనన్(samyuktha menon) జంటగా... సుకుమార్(sukumar) శిష్యుడు కార్తీక్ దండు(karthik dhandu) డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ విరూపాక్ష. సాయి తేజ్ చాలా గ్యాప్ తరువాత విరూపాక్ష సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అసలే వరుస ఫెయిల్యూర్స్.. దానికి తగ్గట్టు యాక్సిడెంట్ అవ్వడంతో.. ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు మెగా హీరో. వాయిస్ కూడా రాకపోవడంతో.. తాను అసలు మళ్ళీ నటిస్తానా లేదా అన్న అనుమానం కూడా కలిగిందని తాజాగా వెల్లడించాడు సాయితేజ్. ఇక వాటిని అధిగమించి విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు సాయి తేజ్. హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈమూవీ ఏప్రిల్ 21 అయ్యి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

విరుపాక్ష సినిమా ఫస్ట్ షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్కుకుంది. బాక్సాఫీస్ దగ్గర దడదడలాడిస్తోంది. ఇక సాయి ధరమ్ తేజ్ పెద్ద గడం నుంచి కోలుకుని కమ్ బ్యాక్ ఇస్తున్న మూవీ కావడంతో.. మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సాయి తేజ్ చేత కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసుకున్నారు. సాయి తేజ్ కు సురేఖ కేక్ తినిపిస్తున్న ఫోటో శేర్ చేసి విష్ చేశారు మెగాస్టార్.

తాజాగా ఈ మూవీ సక్సెస్ గురించి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా రియాక్ట్ అయ్యాడు. “కాంగ్రాట్యులేషన్స్ బ్రదర్. విరూపాక్ష గురించి మంచి టాక్ వినిపిస్తుంది” అంటూ ట్వీట్ చేశాడు. దీనికి సాయి ధరమ్ రిప్లై ఇస్తాడు.. ‘థాంక్యూ సో మచ్ మై లవింగ్ బ్రదర్ చరణ్’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అంతా దిల్ ఖుష్ అవుతున్నారు. సంబరాలు చేసుకుంటున్నారు.

అంతే కాదు కలెక్షన్స్ పరంగా కూడా విరూపాక్ష మూవీ జోరు చూపిస్తుంది. మొదటి రోజే ఏకంగా 12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను అందుకుంది మూవీ. ఇది సాయి తేజ్ కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్. అటు US బాక్స్ ఆఫీస్ వద్ద కూడా 200K డాలర్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టినట్లు తెలుస్తుంది. ఇక పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కి.. ఓన్లీ తెలుగులో మాత్రమే రిలీజ్ అయ్యింది విరూపాక్ష. తెలుగులో మంచి స్పందన రావడంతో.. ఇతర భాషల్లో కూడా ఈసినిమాను రిలీజ్ చేస్తారని సమాచారం.

Updated On 23 April 2023 9:53 AM GMT
Ehatv

Ehatv

Next Story