చంద్రముఖి2(chandramukhi 2) సినిమా ఎలా ఉన్నా.. ఈసినిమాగురించి మాత్రం సామాన్యులతో పాటు..సెలబ్రిటీలు కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు మరీ ముఖ్యంగా పాత చంద్రముఖీ కథానాయకుడు..తలైవా రజినీకాంత్(Rajinikanth) స్పెషల్ గా టీమ్ ను అప్రిషియేట్ చేస్తూ.. లెటర్(Letter) కూడా రిలీజ్ చేశారు.

చంద్రముఖి2(chandramukhi 2) సినిమా ఎలా ఉన్నా.. ఈసినిమాగురించి మాత్రం సామాన్యులతో పాటు..సెలబ్రిటీలు కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు మరీ ముఖ్యంగా పాత చంద్రముఖీ కథానాయకుడు..తలైవా రజినీకాంత్(Rajinikanth) స్పెషల్ గా టీమ్ ను అప్రిషియేట్ చేస్తూ.. లెటర్(Letter) కూడా రిలీజ్ చేశారు.

రాఘవా లారెన్స్(Raghava Lawrence) ప్రధాన పాత్రలో.. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్(Kangana Ranuth) చంద్రముఖిగా నటించిన సినిమా చంద్రముఖి2. ఈమూవీ తాజాగా 28న రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించింది. చంద్రముఖి పాత్రలో కంగనా బాగుంటుంది అనుకుంటేు.. ఈ పాత్రలో కంగనా రనౌత్ అస్సలు బాలేదు అనే విర్షలు వినిపిస్తున్నాయి. అంతే కాదు పాత చంద్రముఖి సినిమాకు వచ్చిన రెస్పాన్స్ లో సగం కూడా సాధించలేకపోయింది చంద్రముఖి 2. అయితే రిలీజ్అయ్యి రెండురోజులే కాబట్టి లాంగ్ రన్ లో సినిమా ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈసినిమాపై మిశ్రమ స్పందన వస్తోంది. చంద్రముఖి సినిమానే అటు ఇటు తిప్పి.. చంద్రముఖి2 గా చూపించారు అన్న విమర్ష ఉంది.

ఇక ఈమూవీపై రకరకాల వాదనలువినిపిస్తున్న వేళ.. సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ఈసినిమాపై స్పందించారు. చంద్రముఖి సినిమాపై ఓ లెటర్ రిలీజ్ చేశారు తలైవా. రజినీకాంత్ నుంచి ఒక సర్‌ప్రైజింగ్ లెటర్ వచ్చింది. ఆ లెటర్ రజిని.. “నా మిత్రుడు వాసు తన బిగ్గెస్ట్ హిట్ చంద్రముఖిని కొత్త యాంగిల్‌లో, భారీ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రంగా సినీ అభిమానులకు చంద్రముఖి 2 ద్వారా అందించాడు. వాసు గారికి, రాఘవ లారెన్స్ గారికి, చిత్రబృందం అందరికీ నా శుభాకాంక్షలు” అంటూ పేర్కొన్నాడు. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాతలు ఆ లెటర్ ని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇక దాదాపు 18 ఏళ్ల క్రితం అంటే 2005 లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. హరర్ కామెడీ మూవీ చంద్రముఖి ఆడియన్స్ ముందుకు వచ్చింది చంద్రముఖి. పి.వాసు డైరెక్ట్ చేసిన మూవీలో జ్యోతిక చంద్రముఖిగా నటించి ఎంతలా భయపెట్టిందో అందరికి తెలిసిందే. అప్పటిలో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇన్నాళ్లు తరువాత ఆ మూవీకి ఇప్పుడు సీక్వెల్ ని తీసుకు వచ్చాడు దర్శకుడు వాసు. అయితే ఈ మూవీలో హీరోగా రజినీకాంత్ ను తీసుకోవాలి అనుకున్నారు. కాని ఆయన సున్నితంగా తిరస్కరించడంతో.. ఆయనకి బదులు రాఘవ లారెన్స్ ని తీసుకున్నాడు.

Updated On 1 Oct 2023 6:40 AM GMT
Ehatv

Ehatv

Next Story