ఎంతైనా ప్రభాస్‌(Prabhas) ప్రభాసే! ఆయన ఎత్తు ముందు మిగతా హీరోలు మరుగుజ్జుల్లా ఎలా కనిపిస్తారో, ఆయన దాతృత్వం ముందు కూడా హీరోలు చిన్నబోతారు

ఎంతైనా ప్రభాస్‌(Prabhas) ప్రభాసే! ఆయన ఎత్తు ముందు మిగతా హీరోలు మరుగుజ్జుల్లా ఎలా కనిపిస్తారో, ఆయన దాతృత్వం ముందు కూడా హీరోలు చిన్నబోతారు. కేరళలోని(Kerala) వాయనాడ్‌లో(Wayanad) జరిగిన ప్రకృతి విపత్తు వందలాది మంది ప్రాణాలు బలితీసుకుంది. ఊహించని ఆస్తి నష్టాన్ని కలిగించింది. వాయనాడ్‌ను ఆదుకునేందుకు సినిమారంగానికి చెందిన ప్రముఖులు నడుం బిగించారు. ఇప్పటికే టాలీవుడ్‌ నుంచి అల్లు అర్జున్‌, చిరంజీవి(Chiranjeevi)-రామ్‌చరణ్‌లు(Ram charan) విరాళాలు ప్రకటించారు. తాజాగా డార్లింగ్‌ ప్రభాష్‌ కూడా భారీ విరాళాన్ని ప్రకటించాడు. అల్లు అర్జున్ 25 లక్షల రూపాయలు ఇవ్వగా.. చిరంజీవి-రామ్ చరణ్ కలిపి కోటి రూపాయలు అందించారు. ఇప్పుడు ప్రభాస్ ఏకంగా 2 కోట్ల(2 crores) రూపాయల్ని కేరళ సీఎమ్ రిలీఫ్ ఫండ్‌కి ఇచ్చారు. దీంతో డార్లింగ్ హీరోని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇక సౌత్‌ ఇండియా నుంచి సూర్య, జ్యోతిక, ఫహద్ ఫాజిల్, రష్మిక, నయనతార తదితరులు లక్షల రూపాయలు విరాళాలుగా ప్రకటించారు.

Eha Tv

Eha Tv

Next Story