ఇంటర్నేషనల్ స్టార్‌ ప్రభాస్‌(Prabhas) ప్రస్తుతం కల్కి 2898 ఏడీ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతినిండా సినిమాలు ఉన్నాయి. సలార్‌(Salaar) హిట్‌ కావడంతో ప్రభాస్‌ గ్రాఫ్‌ మళ్లీ పైకి లేచింది. లేటెస్ట్‌గా ఆయనకు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో(social media) వైరల్‌ అవుతోంది. ఆయన లండన్‌లోని(Landon) ఓ విలాసవంతమైన భవంతిని కొన్నాడని తెలుస్తోంది.

ఇంటర్నేషనల్ స్టార్‌ ప్రభాస్‌(Prabhas) ప్రస్తుతం కల్కి 2898 ఏడీ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతినిండా సినిమాలు ఉన్నాయి. సలార్‌(Salaar) హిట్‌ కావడంతో ప్రభాస్‌ గ్రాఫ్‌ మళ్లీ పైకి లేచింది. లేటెస్ట్‌గా ఆయనకు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో(social media) వైరల్‌ అవుతోంది. ఆయన లండన్‌లోని(Landon) ఓ విలాసవంతమైన భవంతిని కొన్నాడని తెలుస్తోంది. సినిమా షూటింగ్‌లు, వెకేషన్స్‌ కోసం ప్రభాస్‌ లండన్‌కు వెళ్లినప్పుడల్లా అదే ఇంట్లో ఉండేవారట! సుమారు కోటి రూపాయల వరకు అద్దె చెల్లించేవారట! ఆ భవంతి ప్రభాస్‌కు బాగా నచ్చడంతో భారీ మొత్తం చెల్లించి దాన్ని సొంతం చేసుకున్నారని తెలిసింది. ఇకనుంచి అద్దె చెల్లించే బాధకూడా తప్పుతుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం నాగ అశ్విన్‌ దర్శకత్వంలో కల్కి 2898 ఏడీ సినిమా కోసం ప్రభాస్‌ వర్క్‌ చేస్తున్నారు. ఈ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో దీపికా పదుకొణె, అమితాబ్‌ బచ్చన్‌, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇది కాకుండా దర్శకుడు మారుతితో రాజాసాబ్‌, ప్రశాంత్‌ నీల్‌తో సలార్‌ 2 సినిమాలు చేస్తున్నారు ప్రభాస్‌.

Updated On 27 March 2024 1:02 AM GMT
Ehatv

Ehatv

Next Story