ప్రస్తుతం యంగ్ టాలీవుడ్ హీరో నితిన్‌ ఆశలన్నీ వక్కంతం వంశీ(Vakkantam Vamsi) సినిమాపైనే ఉన్నాయి. ఎక్స్‌ట్రా ఆర్డీనరి టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్సే ఉన్నాయి. డిసెంబర్‌ కల్లా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న ఈ మూవీలో నితిన్ సరసన హీరోయిన్ గా ఈ సినిమాలో శ్రీలీల(sreeleela) హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత నితిన్‌.. తన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన వెంకీ కుడుములతో మరోసారి చేతులు కలుపుతున్నాడు.

హిట్టు.. ప్లాపు.. అంటూ.. నితిన్(Nithin) కెరీర్ అటు ఇటు కొట్టుమిట్టాడుతోంది. ఏదో ప్రయత్నం చేస్తున్నాడు కాని.. సాలిడ్ హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు నితిన్. అందుకే సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడట.

ప్రస్తుతం యంగ్ టాలీవుడ్ హీరో నితిన్‌ ఆశలన్నీ వక్కంతం వంశీ(Vakkantam Vamsi) సినిమాపైనే ఉన్నాయి. ఎక్స్‌ట్రా ఆర్డీనరి టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్సే ఉన్నాయి. డిసెంబర్‌ కల్లా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న ఈ మూవీలో నితిన్ సరసన హీరోయిన్ గా ఈ సినిమాలో శ్రీలీల(sreeleela) హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత నితిన్‌.. తన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన వెంకీ కుడుములతో(Venky kudumula) మరోసారి చేతులు కలుపుతున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. రేపో మాపో సెట్స్‌ మీదకు కూడా వెళ్లనుంది.

అయితే ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం అందరిని ఆశ్చర్య పరుస్తోంది. ఈ సినిమా కోసం నితిన్‌ మరింత యంగ్‌ లుక్‌లో కనుపించనున్నాడని టాక్‌. నలబై ఏళ్లు వచ్చినా..నితిన్ స్లిమ్ గా యంగ్ గానే ఉంటాడు..ఆవిషయం తెలిసిందే.. కాని ఈసినిమాలో మాత్రం అంతకంటే 20 ఏళ్లు వయసు తగ్గి కనిపించబోతున్నాడట. వెంకీ ఈ సినిమా కోసం ఓ సాలిడ్‌ ఫ్లాష్ బ్యాక్‌ ఎపిసోడ్‌ను రాసుకున్నాడట. అందులో 21ఏళ్ల కుర్రాడిలా నితిన్‌ను చూపించబోతున్నాడని అంటున్నారు.

అయితే ఈ ప్రక్రియను అంతా.. అడ్వాన్స్ డ్.. వీఎఫ్‌ఎక్స్‌ సహాయంతో చేయబోతున్నట్టు తెలుస్తోంది. నితిన్‌ను కుర్రాడిలా సహజంగా చూపించాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారట టీమ్. నలభై ఏళ్లున్న నితిన్‌ను దాదాపు 20ఏళ్లు తగ్గించి చూపడం అనేది కత్తి మీద సామే. ఒక వేళ నితిన్ 20 ఏళ్ల కుర్రాడిలా కనిపించడం అంటే .. దిల్ సినిమాలోలా ఉంటాడా అన్న అనుమానాలు వస్తున్నాయి. జయం సినిమా మాదిరి ఉంటాడేమో అనే ఆలోచన కూడా కలుగుతోంది. ఇక ఈసినిమా కథ విషయంలో కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి.

అరుదైన వ్యాధి వల్ల నెలరోజుల్లో చనిపోతానని తెలిసిన ఒక అబ్బాయి.. ఆ నెల రోజులు తన జీవితాన్ని ఎలా గడిపాడు. తన జీవితానికి దక్కిన ముగింపేంటీ అనే కథతో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు జీ.వి. ప్రకాష్ కుమార్‌ సంగీతం అందించనున్నారు.

Updated On 7 Aug 2023 8:21 AM GMT
Ehatv

Ehatv

Next Story