కార్తికేయ-2 సినిమాతో హీరో నిఖిల్‌(Nikhil)రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ కాకపోయినా హిందీ బెల్ట్‌లో కూడా ఆ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు నిఖిల్‌తో సినిమా తీయడానికి పెద్ద పెద్ద బ్యానర్లు కూడా ముందుకొస్తున్నాయి. నిఖిల్‌ కూడా చాలా తెలివిగా సబ్జెక్టులను ఎంచుకుంటున్నాడు.

కార్తికేయ-2 సినిమాతో హీరో నిఖిల్‌(Nikhil)రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ కాకపోయినా హిందీ బెల్ట్‌లో కూడా ఆ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు నిఖిల్‌తో సినిమా తీయడానికి పెద్ద పెద్ద బ్యానర్లు కూడా ముందుకొస్తున్నాయి. నిఖిల్‌ కూడా చాలా తెలివిగా సబ్జెక్టులను ఎంచుకుంటున్నాడు. గత రెండు మూడేళ్లుగా కంటెంట్‌ ఓరియంటెడ్‌ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాడు. నిఖిల్‌తో సినిమా తీస్తే డబ్బులు ఎక్కడికి పోవనే నమ్మకం నిర్మాతలకు కూడా కలిగింది. కార్తికేయ-2తో తన ఇమేజ్‌ను అమాంతం పెంచుకున్న నిఖిల్‌ ఇప్పుడన్ని పాన్‌ ఇండియా లెవల్‌ సినిమాలనే చేస్తున్నాడు. గత ఏడాది నిఖిల్‌ నటించిన 18 పేజీస్‌ కూడా సక్సెసయ్యింది. అందులో నిఖిల్‌ నటనకు ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం అతడు నటించిన స్పై కూడా కంటెంట్ తరహా సినిమానే. ఇప్పుడు నిఖిల్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్నవే. ఇటీవలే ప్రకటించిన ది ఇండియన్ హౌజ్ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్‌లోనే తెరకెక్కుతుంది. మెగా పవర్‌స్టార్‌ రామ్ చరణ్(Ram Charan) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతోనే రామ్‌ వంశీకృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే రిలీజైన టైటిల్ గ్లింప్స్ అంచనాలను బాగా పెంచింది. ఇదిలా ఉంటే లేటెస్ట్‌గా నిఖిల్ మరో పాన్ ఇండియా సినిమాను అనౌన్స్‌ చేశాడు. భరత్ కృష్ణమాచార్య దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రీ లుక్‌ను చాలా ఇంట్రెస్ట్‌గా రూపొందించారు. ఒక ఖ‌డ్గం త‌ర‌హాలో ఉన్న ఆయుధంతో ప్రీ లుక్‌ను డిజైన్ చేశారు. ఇవాళ ఈ సినిమా టైటిల్, ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేయ‌బోతున్నారు. బింబిసార ర‌చ‌యిత వాసుదేవ్ ఈ సినిమాకి మాట‌లు అందిస్తున్నాడు .మ‌నోజ్ ప‌ర‌మ‌హంస‌, కేజీఎఫ్‌ ఫేమ్‌ ర‌వి బ‌స్రూర్ లాంటి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు ప‌ని చేయ‌నున్నారు.

Updated On 1 Jun 2023 1:50 AM GMT
Ehatv

Ehatv

Next Story