టాలీవుడ్ యంగ్ స్టార్స్ లో నిఖిల్(Nikhil) కూడా ఒకడు. ఈమధ్య అతని టైమ్ బాగా కలిసి వస్తుంది. ఒక్క సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు నిఖిల్. ఇక నిఖిల్ చేస్తున్నసినిమాలు.. ఆయన స్టోరీ సెలక్షన్స్ చూస్తుంటే.. పెద్ద పెద్ద స్టార్‌లు సైతం నిఖిల్ ఆలోచనలకు ఆశ్చర్యపోతున్నారు.

టాలీవుడ్ యంగ్ స్టార్స్ లో నిఖిల్(Nikhil) కూడా ఒకడు. ఈమధ్య అతని టైమ్ బాగా కలిసి వస్తుంది. ఒక్క సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు నిఖిల్. ఇక నిఖిల్ చేస్తున్నసినిమాలు.. ఆయన స్టోరీ సెలక్షన్స్ చూస్తుంటే.. పెద్ద పెద్ద స్టార్‌లు సైతం నిఖిల్ ఆలోచనలకు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే కార్తికేయ-2తో(Karthikeya-2) పాన్‌ ఇండియా లెవల్లో సాలిడ్‌ గా మార్కెట్‌ పెంచుకున్న నిఖిల్‌.. అలాంటి వెరైటీ సినిమాలు మరో రెండు లైన్ లో పెట్టాడు.

ఇలానే సినిమాలు చేస్తూ.. ఇంకో రెండు హిట్లు పడితే స్టార్ హీరోల సరసన నిఖిల్ సిద్దార్ధ్ చేరడం ఖాయం అంటున్నారు సినిమా పండితులు. . ఇక ప్రస్తుతం నిఖిల్ చేస్తున్న సినిమాలన్నీ పాన్‌ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్నవే. అందులో స్వయంభు(Swayambhu) ఒకటి. తమిళంలో పలు సినిమాలు రైటర్‌గా పని చేసిన భరత్ కృష్ణమాచారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

కత్తిసాము(Sword Fight) నేర్చుకుని .. ప్రాక్టీస్ చేయడం కోసం.. ఆయన వియత్నాం(Vietnam) వెళ్ళాడు. .. అక్కడి సముద్ర తీరంలో నిఖిల్‌ కత్తిసాము ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ప్రొఫెషనల్‌లా కత్తి తిప్పుతున్న నిఖిల్‌ డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. టాలీవుడ్‌ లక్కి గర్ల్‌ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను భువన్‌ , శ్రీకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

స్వయంభూ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా టైటిల్ తోనే సగం మార్కులు కొట్టేశాడు నిఖిల్. మరిసినిమా విషయంలో కూడా ఇలానే ఇప్రెస్ క్రియేట్ చేస్తాడా లేదా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లకు ఊహించని రేంజ్‌లో రెస్పాన్స్‌ వచ్చింది. యుద్ద వీరుడి గెటప్‌లో ఉన్న నిఖిల్‌ను చూసి అంతా ఫిదా అవుతున్నారు.

Updated On 2 Oct 2023 3:46 AM GMT
Ehatv

Ehatv

Next Story