సౌతిండియా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారిప్పుడు. ఆయన నటించిన కొత్త సినిమా జైలర్‌(Jailler) త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా తర్వాత ఆయన జైభీమ్‌(Jaibheem) దర్శకుడు టి.జె.జ్ఞానవేల్‌తో(TJ Gnanavel) ఓ సినిమా చేయబోతున్నారు. సామాజిక అంశాలను స్పృశిస్తూ ఈ సినిమా సాగుతుందని, యథార్థ సంఘటనల ఆధారంగా చిత్రాన్ని రూపొందిస్తున్నారని తెలిసింది.

సౌతిండియా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారిప్పుడు. ఆయన నటించిన కొత్త సినిమా జైలర్‌(Jailler) త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా తర్వాత ఆయన జైభీమ్‌(Jaibheem) దర్శకుడు టి.జె.జ్ఞానవేల్‌తో(TJ Gnanavel) ఓ సినిమా చేయబోతున్నారు. సామాజిక అంశాలను స్పృశిస్తూ ఈ సినిమా సాగుతుందని, యథార్థ సంఘటనల ఆధారంగా చిత్రాన్ని రూపొందిస్తున్నారని తెలిసింది. జైభీమ్‌ సినిమాను కూడా జ్ఞానవేల్‌ అలాగే తెరకెక్కించి అందరి ప్రశంసలు అందుకున్నారు. విశ్వనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాచురల్‌ స్టార్‌(Nani) నాని ఓ కీలకమైన పాత్రను పోషించబోతున్నారు. నానికి కథ ఎంతగానో నచ్చిందట! పైపెచ్చు రజనీకాంత్‌ వంటి అగ్రనటుడితో కలిసి నటించే అవకాశం రావడంతో మరో మాట మాట్లాడకుండా సినిమాను ఒప్పేసుకున్నారట! మేకర్స్‌ నానిని సంప్రదించగానే ఓకే చెప్పేశారని చెబుతున్నారు. అయితే మూవీ మేకర్స్‌ నుంచి ఓ అధికార ప్రకటన వస్తే ఇందులో నిజానిజాలు తెలుస్తాయి. రీసెంట్‌గా నాని దసరా సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన హాయ్‌ నాన్న(Hi Nana) అనే సినిమాలో నటిస్తున్నారు. తండ్రీ కూతురు సెంటిమెంట్‌ ప్రధానాంశంగా సినిమాను రూపొందిస్తున్నారు.

Updated On 29 July 2023 1:53 AM GMT
Ehatv

Ehatv

Next Story