రాజకీయనాయకులను(Politics) చూస్తే అసహ్యం వేస్తున్నదని సినీ నటుడు నాని అన్నారు.
ఏ చెత్తయినా మాట్లాడి తప్పించుకోవచ్చని భావించే రాజకీయనాయకులను(Politics) చూస్తే అసహ్యం వేస్తున్నదని సినీ నటుడు నాని అన్నారు. సమంత(Samantha), నాగచైతన్య(chaithaya) విడాకుల(Divorce) అంశం మీద మంత్రి కొండా సురేఖ(Konda surekha) వ్యాఖ్యలపై నాని రియాక్టవుతూ, ఇంత బాధ్యతారహితంగా మాట్లాడేవారు ప్రజల పట్ల బాధ్యతాయుతంగా ఉంటారని ఆశించడం తమ తెలివితక్కువతనమే అవుతుందన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఎటువంటి ఆధారం లేకుండా మీడియా ముందు చెత్త మాట్లాడితే చెల్లుతుందనుకోవడం చెల్లదని ఘాటుగా వ్యాఖ్యానించారు. సమాజంపై దుష్ప్రభావం చూపే ఇటువంటి ప్రయత్నాలను ఖండించాలని నాని కోరారు.
Disgusting to see politicians thinking that they can get away talking any kind of nonsense. When your words can be so irresponsible it’s stupid of us to expect that you will have any responsibility for your people. It’s not just about actors or cinema. This is not abt any…
— Nani (@NameisNani) October 2, 2024