నాచులర్ స్టార్ నాని(Nani) విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఒకే జానర్‌కు కట్టబడి ఉండకుండా ప్రతీ సినిమాకు ఓ కొత్తదనం చూపిస్తున్నారు. ఆయన ఖాతాలో బ్లాక్‌బస్టర్ సినిమాలు లేకపోవచ్చు కానీ, విజయవంతమైన సినిమాలు చాలానే ఉన్నాయి. అందుకు కారణం స్టోరీ సెలెక్షన్. ఈ ఏడాది దసరా(Dasara) సినిమా నానికి మంచి హిట్‌నిచ్చింది.

Nani 30 Movie Title
నాచులర్ స్టార్ నాని(Nani) విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఒకే జానర్‌కు కట్టబడి ఉండకుండా ప్రతీ సినిమాకు ఓ కొత్తదనం చూపిస్తున్నారు. ఆయన ఖాతాలో బ్లాక్‌బస్టర్ సినిమాలు లేకపోవచ్చు కానీ, విజయవంతమైన సినిమాలు చాలానే ఉన్నాయి. అందుకు కారణం స్టోరీ సెలెక్షన్. ఈ ఏడాది దసరా(Dasara) సినిమా నానికి మంచి హిట్‌నిచ్చింది. ఆ సినిమాతో మాస్ కంబ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో ఓ క్లాస్ సినిమాకు సిద్ధమయ్యారు. ఈ సినిమాతోనే శౌర్యువ్(Sauryuv) దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఇది నానికి 30వ సినిమా కావడం విశేషం. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్ చూస్తుంటే ఇది తండ్రి కూతుళ్ల సెంటిమెంట్‌తో సాగే కథని అర్థమవుతోంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా విడుదల కాబోతున్నది. ఇక ఈసినిమాకు టైటిల్ ఫిక్సయిపోయిందని సమాచారం. ఈ సినిమాకు హలో డాడీ(Hello Daddy) అనే పేరు పెడుతున్నారట.
గతంలో చిరంజీవి(chiranjeevi) హీరోగా డాడీ(Daddy) అనే సినిమా వచ్చింది. ఇది కూడా తండ్రి కూతురు సెంటిమెంట్‌తోనే వచ్చింది. ఇక ఇప్పుడున్న ట్రెండ్‌కు తగినట్టు హలో డాడీ అనే టైటిల్ అయితే బాగుంటుందని మేకర్స్ అనుకుంటున్నారట! హాయ్ డాడీ(Hi Daddy), హలో నాన్న(Hello Nana) వంటి పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికి హలో డాడీ పేరునే దాదాపుగా ఖాయం చేసినట్టు సమాచారం.
నాలుగేళ్ల క్రితం విక్రమ్ కుమార్‌తో(Vikram Kummar) తీసిన గ్యాంగ్ లీడర్(Ganag Leader) సినిమా టైటిల్ కూడా చిరంజీవికి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సినిమా టైటిలే. ఎమోషనల్ జర్నీగా సాగే నాని 30 సినిమాలో సీతారామం(Sita Ramam) ఫేమ్ మృణాళ్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్‌గా నటిస్తున్నారు. నాని కూతురు పాత్రలో కియారా ఖన్నా(Kiara Khanna) అనే పాప నటిస్తోంది. ఈ సినిమాలో హృదయానికి హత్తుకునే సన్నివేశాలు చాలా ఉన్నాయని, అవి మనల్ని ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తాయని అంటున్నారు. వైరా మూవీస్(Vaira Movies) బ్యానర్‌పై మోహన్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మలయాళ సంగీత విద్వాంసుడు హేషమ్ అబ్దుల్ వాహద్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈసినిమా టైటిల్ పోస్టర్‌ను రివీల్ చేయబోతున్నారు.
