కొండా సురేఖకు(Konda surekha) వ్యతిరేకంగా నాగార్జున() వేసిన పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో(Nampally) విచారణ జరిగింది.

కొండా సురేఖకు(Konda surekha) వ్యతిరేకంగా నాగార్జున() వేసిన పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో(Nampally) విచారణ జరిగింది. తదుపరి విచారణ ఈనెల 10కి వాయిదా వేసిన కోర్టు. ఈ రోజు విచారణలో నాగార్జున వాంగ్మూలం రికార్డ్ చేసిన కోర్టు.. నాగార్జునతో పాటు సుప్రియ స్టేట్మెంట్‌ కూడా రికార్డ్ చేశారు. ఈనెల 10న మరో సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్మెంట్‌ రికార్డ్‌ చేయనున్న కోర్టు. తన స్టేట్మెంట్‌ రికార్డ్‌ సందర్భంగా నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు అసత్యాలు మాట్లాడారని.. రాజకీయ దురుద్దేశంతోనే మంత్రి వాఖ్యలు చేశారని నాగార్జున కోర్టుకు చెప్పారు. సురేఖ వ్యాఖ్యలు టీవీలు, పత్రికల్లో వచ్చాయి.. తమ కుటుంబ మర్యాదలకు భంగం వాటిల్లిందని నాగార్జున అన్నారు. తమ కుటుంబానికి తీవ్ర నష్టం చేకూరిందని

నాగచైతన్య(Naga chaithanya), సమంత(Samantha) విడాకులపై(Surekha) సురేఖవి అబద్దాలన్నారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.

Eha Tv

Eha Tv

Next Story