అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya)కు కాలం కలిసిరావడం లేదు. కష్టపడి చేసిన సినిమాలు కూడా బాక్సాఫీసు దగ్గర ఢమాల్‌ అంటున్నాయి. ఇప్పుడతను ఓ మంచి కమ్‌బ్యాక్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. అతడికి మంచి హిట్‌ వచ్చి రెండేళ్లవుతుంది. లవ్‌ స్టోరీ(Love Story) సినిమా తర్వాత నాగ చైతన్యకు హిట్ సినిమా లేదు. నాగార్జున(Nagarjuna)తో కలిసి నటించిన బంగార్రాజు సినిమా బ్రేక్‌ ఈవెన్‌ కంప్లీట్‌ చేసుకోకుండానే వెనక్కిపోయింది.

అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya)కు కాలం కలిసిరావడం లేదు. కష్టపడి చేసిన సినిమాలు కూడా బాక్సాఫీసు దగ్గర ఢమాల్‌ అంటున్నాయి. ఇప్పుడతను ఓ మంచి కమ్‌బ్యాక్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. అతడికి మంచి హిట్‌ వచ్చి రెండేళ్లవుతుంది. లవ్‌ స్టోరీ(Love Story) సినిమా తర్వాత నాగ చైతన్యకు హిట్ సినిమా లేదు. నాగార్జున(Nagarjuna)తో కలిసి నటించిన బంగార్రాజు సినిమా బ్రేక్‌ ఈవెన్‌ కంప్లీట్‌ చేసుకోకుండానే వెనక్కిపోయింది. ఇక థాంక్యూ సినిమా అయితే వచ్చినట్టు కూడా ఎవరికీ తెలియదు.. అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. అక్కినేని అభిమానులకు కూడా ఈ సినిమా ఫలితాన్ని డైజెస్ట్‌ చేసుకోలేకపోతున్నారు. మొన్నీమధ్య వచ్చిన కస్టడీ సినిమా కూడా అంతే! చాలా ఘోరంగా దెబ్బతిన్నది. కొన్ని ప్రాంతాలలో అయితే పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదు. ఇప్పుడు ఏమి చేయడమా అని నాగచైతన్య ఆలోచిస్తున్నాడు. మంచి కమ్‌బ్యాక్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. కొత్త కథతో వెళ్లి రిస్క్‌ తీసుకోవడం కంటే రీమేక్‌ స్టోరీతో వెళ్లడం బెటరని అనుకుంటున్నాడు. లాస్టియర్‌ బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అయిన భూల్‌ భూలయ్య-2(Bhool Bhulaiyaa 2) సినిమాను నాగ చైతన్య రీమేక్‌ చేస్తున్నాడన్న టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. బాక్సాఫీసు దగ్గర ఈ సినిమా కలెక్షన్లను కుమ్మేసింది. అయితే ఈ వార్తలపై నాగచైతన్య టీమ్ స్పందించింది. భూల్‌భూలయ్య-2 సినిమాను రీమేక్ చేస్తున్నామన్న వార్తలో నిజం లేదని, వాటిని నమ్మకూడదని చెప్పింది. నాగచైతన్య సినిమాలకు సంబంధించిన ప్రకటనలు అధికారికంగా తామే చెప్తామని, అంతవరకు ఎలాంటి వార్తలు పట్టించుకోవద్దని స్పష్టం చేసింది. నాగచైతన్య తన తర్వాతి సినిమాను గీతా ఆర్ట్స్-2 బ్యానర్లో చేయనున్నాడు. దర్శకుడి ఎవరన్నది ఇంకా కన్ఫామ్‌ కాలేదు కానీ ఈ సినిమాలో నాగ చైతన్య ఫిషింగ్ బోటు డ్రైవర్‌గా కనిపించబోతున్నాడు. గుజరాత్‌(Gujarat)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమా ఉండబోతుందట. దీంతో పాటు నాగచైతన్య నటించిన దూత వెబ్ సిరీస్(Dootha Web Series) షూటింగ్ పూర్తి చేసుకుని స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది.

Updated On 6 Jun 2023 2:19 AM GMT
Ehatv

Ehatv

Next Story