☰
✕
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)- ధూళిపాళ్ల శోభితా(Shobita Dhulipala) త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న విషయం తెలిసిందే.
x
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)- ధూళిపాళ్ల శోభితా(Shobita Dhulipala) త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ అయ్యింది. డిసెంబర్‌లో ఓ శుభ ముహూర్తానా వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. సమంతతో విడిపోయిన తర్వాత శోభితాను ప్రేమించారు నాగ చైతన్య. లేటెస్ట్‌గా వీరిద్దరు కలిసి ఓ సెల్ఫీ(Selfi) దిగారు. ఇద్దరూ కొత్త లుక్‌లో అదరగొట్టేశారు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోకు ఎవ్రిథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ అనే కాప్షన్ ఇచ్చారు. లవ్ సితారా సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చారు శోభితా ధూళిపాళ్ల. ప్రస్తుతం ఈ సినిమా జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న తండేల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Eha Tv
Next Story