Mahesh Babu Emotional: మీరే అమ్మా.. నాన్న అంటూ మహేష్ కంటతడి..!
మహేష్‌బాబు (Mahesh Babu) ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న 'గుంటూరు కారం (Gunturu Karam)' చిత్రం కొన్ని రోజుల్లో విడుదల కానుంది. ఈ సారి థియేటర్లలో సంక్రాంతి (Sankranthi) పండగ సెలబ్రేట్ చేసుకోవాలని సూపర్ స్టార్ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. మహేష్, త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషనలో ఇది మూడో చిత్రం. దీంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ అంచనాలు వేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గుంటూరులో (Gunturu) గ్రాండ్‌గా నిర్వహించారు.

ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ 'ఈ ఫంక్షన్ ఎక్కడ చేద్దామా అని డిస్కషన్ చేసుకుంటున్నప్పుడు.. త్రివిక్రమే మీ ఊర్లో చేద్దామని సూచించారు. ఈ క్రెడిటంతా త్రివిక్రమ్‌దే అన్నారు. ఆయన అన్నట్లు మన ఊరిలోనే ఈ ఫంక్షన్ చేసుకుంటున్నామని మహేష్ అన్నారు. ఈ వేడుకల్లో మాట్లాడుతూ సూపర్‌స్టార్ మహేష్‌బాబు తన తండ్రి కృష్ణను (Krishna) తలుచుకొని కంటతడి పెట్టారు. తనకు తండ్రి, తల్లిలేనిలోటు మీరే తీర్చాలని అభిమానులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. చిన్నతనంలో మా నాన్న కోసమే సినిమాలు చేసేవాడిని చెప్పారు.
త్రివిక్రం గురించి చెప్పాలంటే.. ఆయన మా కుటుంబసభ్యుల్లో ఒకరు. రెండేళ్లుగా ఆయన నాకు ఇచ్చిన బలం, సహకారం నేనేప్పుడూ మర్చిపోలేనని మహేష్‌బాబు అన్నారు. త్రివిక్రానికి థ్యాంక్స్ చెప్తే ఒక వింతలా ఉంటదన్న ఆయన... ఈ సినిమాలో కొత్త మహేష్‌ను చూస్తారని అన్నారు. మీ అంచనాలకు తగ్గట్లు ఈ సినిమా ఉంటుందని.. ఇందుకు త్రివిక్రమే కారణమన్నారు. మా నిర్మాత చినబాబుకు (Chinababu) ఇష్టమైన హీరో నేనేనని మహేష్ అన్నారు.
ఇక శ్రీలీలతో (Heroine Srileela) డ్యాన్స్ అంటే మామూలుగా ఉండదు. ఆమెతో డ్యాన్సంటే హీరోలకు తాట ఊడిపోతుందన్నారు. తెలుగమ్మాయి ఇంత పెద్ద హీరోయిన్ కావడం చాలా ఆనందంగా ఉందన్న ఆయన.. సినిమా విషయంలో ఆమె డెడికేటెడ్‌గా వర్క్ చేస్తుందన్నారు. షూటింగ్ లేకున్నా స్పాట్‌లోనే ఉంటుందే తప్ప మేకప్ వ్యాన్‌లోకి వెళ్లదని శ్రీలీలను ప్రశసించారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Music Directors Taman) రుణం తీర్చుకోలేదని మహేష్‌బాబు చెప్పారు.
నా సినిమా చూసి రికార్డులు, కలెక్షన్లు గురించి మా నాన్న ఫోన్ చేసి చెప్పేవారు. ఆయన ఫోన్ కోసమే సినిమాలు చేసేవాడిని. కానీ ఇప్పుడు నాన్న . ఇప్పుడు రికార్డులు, కలెక్షన్ల గురించి మీరే చెప్పాలి. ఇక నుంచి మీరే నాకు అమ్మ.. నాకు నాన్న..అన్నీ మీరే. మీ ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని మహేష్ ప్రసంగించారు.